
samantha post about kashmir
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎంత జోష్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు సినిమాలు అటు విహారయాత్రలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. సమంత హీరోయిన్ గా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటుంది. మరోవైపు తన స్టార్ ఇమేజ్‌తో గ్లోబల్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న సమంత పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఊపెస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు తన బిజినెస్‌లని కూడా విస్తరిస్తుంది.
రీసెంట్‌గా కాయిన్‌స్విచ్ కుబేర్ క్రిప్టో యాప్‌కు ప్రచారకర్తగా సమంత మారారు. ఇప్పటికే ఆర్బన్ కిసాన్, సాకీ పలు ఇతర బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సమంత తన ప్రొఫెషనల్ లైఫ్ కి బ్రేక్ ఇచ్చి స్విట్జర్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె గత 10 రోజులుగా రోజుకు దాదాపు 5-6 గంటల పాటు ప్రాక్టీస్ చేసిన తన తాజా స్కీయింగ్ నైపుణ్యాల గురించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. 100 సార్లు పడిపోయా… వదిలేయాలని అనుకున్నా కాని, మళ్లీ పూర్తి చేసానని పేర్కొంది.తన సోషల్ మీడియా పేజ్‌లో స్కీయింగ్ వీడియో షేర్ చేసిన సమంత..
fell 100 times and thought of quitting says samantha
నేను బన్నీ వాల్ పై నా స్కీయింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాను. 100 సార్లు పడిపోయాను. ప్రతిసారీ లేచాను. నిష్క్రమించాలనే ఆలోచన చాలాసార్లు నా మనస్సులోకి వచ్చింది. కానీ నేను సంతోషంగా ఉన్నాను, ముందుకు సాగాను. ఊహించని విధంగా ఇది ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది” అంటూ సామ్ పోస్ట్ చేసింది. ఇందులో స్విట్జర్లాండ్‌లోని వెర్బియర్ స్కీ రిసార్ట్‌లో తనకు స్కీయింగ్ లో శిక్షణను ఇచ్చిన శిక్షకురాలు కేట్ మెక్‌బ్రైడ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం సమంత యశోద అనే చిత్రంతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలలో నటించింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.