Janaki Kalaganaledu 29 April Today Episode : జ్ఞానాంబను బారసాల ఫంక్షన్ కు ఒప్పించిన రుక్మిణి.. ఇంతలో జానకికి బిగ్ షాక్
Janaki Kalaganaledu 29 April Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 290 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు గోవిందరాజు. కానీ.. తను మాత్రం అస్సలు ఒప్పుకోదు. కట్ చేస్తే ఊర్మిల.. జ్ఞానాంబ కుటుంబం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. శ్రావణి కూడా అక్కడే ఉంటుంది. ఇంతలో యోగి వస్తాడు. ఇంకాసేపట్లో బారసాల ఫంక్షన్ పెట్టుకొని ఇలా దిగులుగా ఉన్నావేంటి అని అడుగుతాడు. దీంతో జ్ఞానాంబ ఫ్యామిలీ వచ్చి మన బాబును ఆశీర్వదిస్తేనే ఈ ఫంక్షన్ జరుగుతుంది. లేదంటే ఈ ఫంక్షన్ జరగదు అంటుంది ఊర్మిల. దీంతో ఆవిడ ఎక్కడ వస్తుంది. చివరకు జానకిని కూడా పంపించరు అంటాడు యోగి.

janaki kalaganaledu 29 april 2022 full episode
దీంతో వాళ్లు వస్తారు అంటుంది ఊర్మిల. అవన్నీ జరగాలంటే ఎవరైనా దేవత దిగిరావాలి అంటాడు యోగి. అందుకే.. జానకి ఫ్రెండ్ రుక్మిణిని శ్రావణి పంపిస్తుంది. బాబును కూడా తనతో పాటు పంపిస్తుంది. కట్ చేస్తే.. జానకి బాధగా తన రూమ్ లో కూర్చొని ఉంటుంది. రామా కూడా ఏం మాట్లాడుకుండా ఉంటాడు. వాళ్లను చూసి మల్లిక చాలా సంతోషిస్తుంది. ఇంతలో సడెన్ గా ఆటో వచ్చి ఆగుతుంది. రుక్మిణి బాబును తీసుకొని ఆటో దిగుతుంది. రుక్మిణి రావడాన్ని చూసి మల్లిక, చికిత షాక్ అవుతారు. ఒసేయ్.. చికిత.. ఎవరే ఆ కొత్త క్యారెక్టర్ అని అడుగుతుంది మల్లిక.
జానకి కోసం వచ్చిందంటావా అని అంటుంది. మనం ఊరుకుంటామా అంటూ తన దగ్గరికి వెళ్తుంది. ఆగమ్మా.. ఆగు ఆగు అంటుంది మల్లిక. ఏదో ఆర్ఆర్ఆర్ సినిమాలా దూసుకొస్తున్నావు. ఇక్కడ చెట్టంత మనిషి ఉంటే. ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతుంది.
దీంతో నాపేరు రుక్మిణి అంటుంది. జ్ఞానాంబ గారితో మాట్లాడనీకి వచ్చిన అంటుంది. అసలు ఎవరు నువ్వు.. ఏంది నీ కథ. చూడనీకి ఇంత లేవు.. అంటూ మల్లికపై సీరియస్ అవుతుంది రుక్మిణి. ఇంతలో జ్ఞానాంబ, గోవిందరాజు ఇద్దరూ వస్తారు. వాళ్లకు నమస్కారం పెడుతుంది.
నా పేరు రుక్మిణి అని చెబుతుంది. దీంతో లోపలికి రా అమ్మ అంటుంది జ్ఞానాంబ. బాబును చూస్తుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి, రామా అందరూ వస్తారు. రుక్మిణిని చూసి సంతోషిస్తుంది జానకి. నేను జానకి దోస్తును అంటుంది రుక్మిణి.
Janaki Kalaganaledu 29 April Today Episode : తను ఎందుకు వచ్చానో చెప్పిన రుక్మిణి
రుక్మిణి అంటుంది జానకి. ఇద్దరూ కాసేపు ఎలా ఉన్నావు అని అడుగుతారు. నీ మేనల్లుడు అత్తను చూస్తానంటే చూపించనీకి తీసుకొచ్చిన అంటుంది రుక్మిణి. ఎత్తుకో అంటుంది రుక్మిణి. జానకి తనను ఎత్తుకుంటుంది. కాసేపు బాబుతో ఆడుకుంటుంది జానకి.
మీరు రాకపోతే ఫంక్షన్ చేయనని ఊర్మిల మంకు పట్టు పట్టుకుంది. బారసాల ఫంక్షన్ కు యోగి ఇంటికి వచ్చిన. అక్కడ జానకి కనిపించలేదు. ఏమైంది అని అడిగి.. అసలు విషయం తెలుసుకొని బాబును ఇక్కడికి తీసుకొచ్చిన అంటుంది. అంటే ఏంటమ్మా నువ్వు చెప్పేది.. ఈ బాబుకు మా ఇంట్లోనే బారసాల చేయాలా ఏంటి అని అడుగుతుంది మల్లిక.
దీంతో అవును అంటుంది రుక్మిణి. దీంతో మల్లిక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఓయ్.. గమ్మునుండు. నీ ఎటకారాలు నాటకాలు నాతాన కావు. ఏదో నిమ్మలంగా నన్ను చూసి మస్తు మంచిదాన్ని అనుకుంటున్నవేమో.. రుక్కు ఉక్కు లెక్క. నువ్వు ఎంత గమ్మునుంటే నీకే అంత మంచిగుంటది అని అంటుంది.
జానకిని పంపిస్తాం అని రామా అంటాడు. కానీ.. ఒక్కతే ఎలా పోతది అని అంటుంది రుక్మిణి. చివరకు ఎలాగోలా జ్ఞానాంబ ఫ్యామిలీని బారసాల ఫంక్షన్ కోసం ఒప్పిస్తుంది రుక్మిణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
- Also Read
-
An exciting update about Mahesh Babu Sarkaru Vaari Paata
-
Mega Power Star Ram Charan Confirms Movie With Uncle Pawan Kalyan!