Home » Entertainment » Janaki Kalaganaledu 29 August 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 29 August 2022 Episode : కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న జ్ఞానాంబ కుటుంబం… ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ అవుతున్న జెస్సి…

Authored By
aruna
The Telugu News | Published on: August 29, 2022, 10:30 am
Advertisement

Janaki Kalaganaledu 29 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 376 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. జానకి రామాతో అతయ్య గారు అన్నమాట మనం కూడా తప్పకూడదు.. అంటూ జానకి, రామ దగ్గరవుతూ ఉంటారు.. కట్ చేస్తే విష్ణు మల్లికని ఈరోజు కృష్ణాష్టమి త్వరగా లేకపోతే అమ్మ తిడుతుంది. అని అంటాడు. అప్పుడు మల్లిక నేను ఇప్పుడు గర్భవతిని నాకు అలాంటి రూల్స్ లేవు అని అంటుంది. అప్పుడు విష్ణు పండగపూట అలాంటి రూల్స్ ఏమి పనికిరావు అమ్మ ముందు అని అని వెళ్ళిపోతాడు. దాంతో మల్లిక రెడీ అయి బయటికి వస్తుంది. జానకి ముందుగానే రెడీ అయి ముగ్గు వేస్తూ పండగకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానంబా, గోవిందరాజు తనను చూసి సంతోష పడిపోతూ ఉంటారు. అంతలో రామ బయటి నుంచి జానకి వేసిన కృష్ణ అడుగులో నుంచి వస్తూ ఉండగా…

Advertisement

జానకి కృష్ణుడే వచ్చినట్లుగా ఫీలవుతూ ఉంటుంది. అప్పుడు రామ తను కిందికి చూసి అయ్యో క్షమించండి జానకి గారు అని అంటారు. అప్పుడు జానకి అయ్యో క్షమించండి అంటారేంటి మీరే నాకు ఎప్పటికీ బుడిబుడి అడుగులు వేసే కృష్ణయ్య. అని అంటుంది. తర్వాత జానకి, రామ ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకుంటూ రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు.. ఇదంతా చూస్తున్న గోవిందరాజు దంపతులు తెగ సంతోష పడిపోతూ ఉంటారు. అంతలో అక్కడికి మల్లికా వచ్చి రామా, జానకిని ఎటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు గోవిందరాజు తనకి రీకౌంటు ఇస్తాడు. ఇంట్లో వాళ్ళు అందరూ రామా, జానకిని లవ్ బర్డ్స్ అని పొగుడుతూ ఉంటారు. చికిత కూడా మల్లిక పై సెటైర్ వేస్తుంది. తర్వాత జానకి, రామ గోవిందరాజు వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. వాళ్లు పండంటి బిడ్డని కనాలి అని ఆశీర్వదిస్తారు. అప్పుడు మల్లికా తింగరి తింగరి గా మాట్లాడుతూ మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అత్తయ్య గారు అని అంటుంది. తర్వాత అఖిల్ ని నువ్వు కూడా అన్నయ్య లాగా సాంప్రదాయాలు నీక్కచ్చిగా ఫాలో అవుతూ మా పరువుని నిలబెట్టాలి అని అంటారు గోవిందరాజు.

Janaki Kalaganaledu 29 August 2022 Full Episode

Advertisement

కట్ చేస్తే జెసి వాళ్ల ఇంట్లో జెస్సి కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉంటుంది. దాంతో జేసి అమ్మ, నాన్న కంగారు పడుతూ ఉంటారు. అంతలో డాక్టర్ బయటికి వచ్చి మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దాంతో వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యి.. జెసి నీ వాళ్ళ అమ్మ తనని కొడుతు ఎందుకే ఇంత పని చేసావ్ అని తిడుతుంది. అంతలో వాళ్ల నాన్న ఎవడు వాడు అని గట్టిగా అడుగుతాడు. కానీ తను అఖిల్ పేరు చెప్పదు.. కానీ వాళ్ళ నాన్న జెస్సికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే అఖిల్ వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి చాలా ఘనంగా జరుపుకుంటూ.. కోలాటం ఆడుతూ ఉంటారు. అది చూస్తున్న మల్లికా కూడా కోలాటం ఆడుతాను అని జ్ఞానంభా ను అడుగుతూ ఉంటుంది. కానీ జ్ఞానం నిన్ను ఇంట్లో పనులే చేయొద్దని చెప్పాను. ఇప్పుడు కోలాటం ఎలా ఆడతావు అని తిడుతుంది. అంతలో గోవిందరాజు నీకు బిడ్డ పుట్టాక వాడితో ఆడుకుందువులే ఇప్పుడు గమ్మునే ఉండు అని అంటారు. కానీ మల్లిక ఏదో విధంగా నేను కూడా కోలాటం ఆడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి