Janaki Kalaganaledu 29 Dec Today Episode : వెన్నెలకు మాటిచ్చిన జానకి.. వెన్నెల ప్రేమ విషయం జ్ఞానాంబకు తెలుస్తుందా? జానకి.. జ్ఞానాంబను ఎదిరిస్తుందా?

Authored By Varun G | The Telugu News | Published on: December 29, 2021, 3:00 pm

Janaki Kalaganaledu 29 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 203 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దిలీప్ లేకుంటే నేను బతకలేను. నేను దిలీప్ నే పెళ్లి చేసుకుంటాను.. అంటుంది వెన్నెల. దీంతో నిజమైన ప్రేమ అంటే కలిసి బతకడం.. ప్రాణాలు తీసుకోవడం కాదు అంటుంది. ఆ అబ్బాయితో నేను మాట్లాడుతాను. ఆ కుటుంబం గురించి నేను కనుక్కుంటాను. ఈ విషయం గురించి నాకు వదిలేయ్. అలాగే.. ఈ లోపు నువ్వు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోనని నాకు మాటివ్వు అంటుంది జానకి. దీంతో సరే అని తనకు మాటిస్తుంది జానకి. వదిన నువ్వు మాటిచ్చావంటే కొండంత ధైర్యం వచ్చేస్తుంది. నీ మంచితనంతో నువ్వు ఏదైనా చేయగలవు. ఆ విషయం అఖిల్ విషయంలోనే తెలిసింది.. అని అంటుంది వెన్నెల. నా విషయంలో కూడా అమ్మతో నువ్వు మాట్లాడి అమ్మను ఒప్పిస్తానని నేను అనుకుంటున్నాను అంటుంది వెన్నెల.

janaki kalaganaledu 29 december 2021 full episode

janaki kalaganaledu 29 december 2021 full episode

పూజకు సమయం అవుతుండటంతో నువ్వు వెళ్లి రెడీ అవ్వు అంటుంది జానకి. ఈ ఇంట్లో ప్రేమ, పెళ్లి అనే మాటే వినిపించకూడదని అత్తయ్య గారు చెప్పారు. కానీ.. ప్రేమించిన వాడితో పెళ్లి జరపకపోతే ప్రాణం తీసుకుంటానని వెన్నెల అంటోంది. ఈ విషయాన్ని ఎలా చక్కదిద్దాలి అని మనసులో అనుకుంటుంది జానకి. మరోవైపు ఖార్ఖానాలో పూజ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతుంటాయి. జానకి, రామా ఇంకా రాలేదు ఏంటి.. అని మల్లికను అడుగుతాడు గోవింద రాజు. దీంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లబోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు. దీంతో వెళ్లి జానకి ఎక్కడుందో చూసి.. వస్తావా రావా.. ఎందుకు రాలేదు.. అని అన్నీ కనుక్కొని వస్తాను అని చెబుతుంది మల్లిక. వామ్మో.. మామూలుగా లేదు కదా.. టన్నులు టన్నులుగా ఉంది అంటాడు గోవింద రాజు. ఏంటది అంటే కొవ్వు అంటాడు.

Janaki Kalaganaledu 29 Dec Today Episode : పూజలో పాల్గొనని చెప్పి అలిగి ఇంటికి వెళ్లిపోయిన మల్లిక

ఇంతలో జానకి, రామా వస్తారు. పూజ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. మల్లికను కాదని జానకిని కూర్చొని పూజ చేయమంటుంది జ్ఞానాంబ. దీంతో మల్లిక అలిగి వెళ్లిపోతుంది. దీంతో మల్లిక రా.. ఇద్దరం కలిసి పూజ చేద్దాం అంటుంది జానకి. కానీ మల్లిక రాదు. అబ్బబ్బ.. తోటి కోడలు మీద నీకు ఎంతో ప్రేమ ఉన్నట్టు భలే నటిస్తున్నావు అంటుంది మల్లిక.

మల్లిక రాకపోయేసరికి.. చివరకు జానకి వచ్చి పూజ చేస్తుంది. దీంతో మల్లిక అలిగి ఇంటికి పోతుంది. తనతో పాటు విష్ణు కూడా ఇంటికి వస్తాడు. మల్లిక ఎక్కడున్నావు అని అడుగుతాడు. కానీ.. మల్లిక కనిపించదు. ఇంట్లో కూర్చొని అప్పలు తింటూ ఉంటుంది.

ఇద్దరూ కాసేపు గొడవ పడతారు. మల్లికను తీసుకొస్తా అని చెప్పి విష్ణు ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటాడు గోవింద రాజు. మల్లిక రాకపోతే రాకపోయింది. విష్ణు అయినా రావాలి కదా అంటే.. భలే ఉన్నారు మీరు మల్లికను వదిలేసి వాడెక్కడ వస్తాడు అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp