Home » Entertainment » Janaki Kalaganaledu 29 July 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 29 July Today Episode : జ్ఞానాంబ ఏ నిర్ణయం తీసుకుంటుంది..? రామ జానకిలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా…

Authored By
aruna
The Telugu News | Published on: July 29, 2022, 11:00 am
Advertisement

Janaki Kalaganaledu 29 July Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు ఇది ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈరోజు ఈ సీరియల్ తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 35 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… జానకి చదువు గురించి తెలుసుకున్న అందరూ కంగారు పడుతూ ఉంటారు.. ఏంటో అని.. జ్ఞానంబ రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకుంటుంది.. ఎంతసేపటికి తీయకపోయేసరికి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. జ్ఞానాంబ బయటకు వచ్చి ఎందుకు ఎవరో పోయిన వాళ్ళ లాగా ఇంట్లో అంతా నిశ్శబ్దం అని అందర్నీ తిడుతుంది.. కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడరు.. అప్పుడు జ్ఞానం బా రేపు వరలక్ష్మీ వ్రతం కదా.. పోయిన సంవత్సరం లాగే ఇప్పుడు కూడా జరపాలి.. అందరూ దానికోసం ఏర్పాట్లు చేయండి. అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందరూ సంతోష పడిపోతూ ఉంటారు.

Advertisement

కానీ మల్లికా మాత్రం ఆశ్చర్యంతో కంగు తింటుంది.. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే జానకి, రామ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అమ్మ ఏదో ఒక నిర్ణయం ఇప్పుడే చెప్పేసి ఉంటే బాగుండు. కానీ తన మౌనాన్ని భరించలేకపోతున్నాం. తన బాధని చూడలేకపోతున్నాం. అని అనుకుంటారు ఇద్దరు.. ఇంతలో గోవిందరాజు అక్కడికి వస్తాడు.. చూడండి రామా ఇది మీకు ఒక పరీక్ష అనుకోండి. దాని గురించి ఆలోచించకండి. ఏది జరిగిన మీ మంచికే అనుకోండి. మీ అమ్మ ఎంత ప్రేమిస్తుందో తెలుసు కదా.. తనకు అంతే క్షమించే గుణం కూడా ఉంటుంది. మీరు కంగారు పడకండి మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది. మీరు రేపు వరలక్ష్మీ వ్రతం మనస్ఫూర్తిగా చేయండి.. ఇద్దరు కలిసి, ఆ తల్లిని వేడుకోండి మీకు ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది.

janaki kalaganaledu 29 july 2022 full episode

Advertisement

ఆ తల్లి మీ అమ్మ మనసు మారుస్తుంది. మిమ్మల్ని క్షమిస్తుంది .అని అంటాడు గోవిందరాజు, కట్ చేస్తే జానకి రామ కలసి ఇంటి అలంకరణ చేస్తూ.. జ్ఞానంభ వాళ్లని క్షమిస్తుంది. ఈ పండగ వాతావరణాన్ని చూస్తుంటే మనకి మంచి జరుగుతుంది అని అనిపిస్తుంది అని ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు అంతలో జ్ఞానాంబ అందరికీ బట్టలు తీసుకుని అక్కడికి వస్తుంది.. జానకి రామాల వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. జ్ఞానాంబ ఇంట్లో వాళ్ళ అందర్నీ బయటికి పిలుస్తుంది. విష్ణు ని నువ్వు అలంకరణ చెయ్ ఇంటికి అని అంటుంది. అప్పుడు విష్ణు అన్నయ్య చేస్తున్నాడు కదా అమ్మ అని అంటాడు. కానీ నేను చెప్పింది చేయి విష్ణు అని కోపంగా ఉంటుంది. మల్లికను పిలిచి కోడలంటే ఇంటికి లక్ష్మీదేవిలా ఉండాలి. కానీ మాటిచ్చి నమ్మించి మోసం చేయకూడదు. మాట ఇస్తే ప్రాణం పోయేవరకు దాని మీదే నిలబడాలి. అంటూ జానకిని ఇన్ డైరెక్టుగా తిడుతుంది. మల్లిక నువ్వు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని నీ చేతుల మీదుగా చేయి.

కాళ్లకు పసుపు రాసి దగ్గర నుంచి వాహనాలు ఇచ్చేవరకు అంతా నీ చేతుల మీదనే జరగాలి.. అని చెప్తుంది జ్ఞానంభ, అప్పుడు ఆశ్చర్యంతో అందరూ బాధపడుతూ ఉంటారు. మల్లిక మాత్రం తెగ సంబరాలు పడిపోతూ ఉంటుంది. అలాగే అత్తయ్య గారు మీరు చెప్పిన మాట నేను జవదాటను.. అని డ్రామాలు వేస్తూ ఉంటుంది. అఖిల్ విష్ణువులను మీరు ఇంటి అలంకరణ చూసుకోండి. మీరైనా సరే అమ్మతో ఆడుకోకండి నమ్మించి మోసం చేయకండి.. అమ్మ అంటే ఆట బొమ్మ అనుకోకండి.. ఈ అమ్మని మీరైనా బాధ పెట్టకండి మీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి.. మీ అమ్మని పిచ్చిదాన్ని చేయకండి.. అని అంటుంది. రామ జానకిలు బాధపడుతూ ఉంటారు. వాళ్లని ఏ పని చేయొద్దు.. వ్రతం కూడా చేయొద్దు.. అని ఇండైరెక్టుగా చెప్తుంది ..జ్ఞానంబ, తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి