Sridevi Drama Company : వారం వారం శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క ఆదరణ ప్రేక్షకుల్లో పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టీవీ లో ఆదివారం మధ్యాహ్నం సమయంలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కి అనూహ్యంగా రెస్పాన్స్ దక్కడంతో మల్లెమాల వారు మరియు ఈటీవీ వారు షో నీ మరింత మంచి కంటెంట్ తో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వినోదాత్మకంగా మరియు సందేశాత్మకంగా కాన్సెప్ట్లను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ప్రతి వారం లాగానే నిన్న ఆదివారం ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో హైపర్ ఆది యొక్క సందడి కాస్త తగ్గింది. ఎప్పటిలాగే రైటర్ రామ్ ప్రసాద్ హడావుడి కనిపించింది. పంచ్ ప్రసాద్ మరియు ఇమాన్యుల్, నూకరాజు కామెడీ ల పంచ్ లు ఆకట్టుకున్నాయి. యాంకర్ సుధీర్ తనదైన శైలిలో కుమ్మేసాడు. అయితే ఈ షో కి గెస్ట్ గా సీనియర్ హీరో పృద్వి రావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి కాన్సెప్టుతో ఈ ఎపిసోడ్ ను నిర్వహించారు. అబ్బాయి తరఫున కుటుంబసభ్యులు లేకపోవడంతో డ్రామా ఆర్టిస్టులను తీసుకు వచ్చి అమ్మాయి తండ్రికి సొంత తల్లిదండ్రులు కుటుంబ సభ్యులుగా పరిచయం చేస్తారు. తద్వారా ఏర్పడిన కామెడీని ఆసక్తిగా చూపించడంలో నిర్వాహకులు ఎప్పటిలాగానే సక్సెస్ అయ్యారు.
ఈ ఎపిసోడ్లో ప్రధాన హైలెట్ ఏంటి అంటే రాంప్రసాద్ యొక్క కుటుంబ సభ్యులు. మొత్తం కుటుంబ సభ్యులు షో లోకి వచ్చారు. రాంప్రసాద్ ఉమ్మడి కుటుంబం పరిచయం చేయడంతో చాలా ఫన్నీగా ఆసక్తిగా అనిపించింది. పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చెల్లెలు, అత్తలు, మామలు ఇలా ప్రతి ఒక్కరిని రాంప్రసాద్ పరిచయం చేస్తున్న సమయంలో అతడు పండించిన కామెడీ కూడా నవ్వు తెప్పించే విధంగా ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో కూడా గెటప్ శ్రీను సందడి చేశాడు. వరుసగా రెండు ఎపిసోడ్స్ కు ఆయన రావడంతో ఇక రెగ్యులర్ గా వస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ నిన్నటి ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలిచింది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.