Janaki Kalaganaledu 3 Jan Episode Hightlights : ఐపీఎస్ పరీక్షలో సెకండ్ వచ్చిన జానకి.. ఆనందంలో రామా, జానకి.. ఇంతలో మల్లిక నుంచి మరో షాక్

Authored By Varun G | The Telugu News | Published on: January 1, 2022, 3:00 pm

Janaki Kalaganaledu 3 Jan Episode Hightlights : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు విడుదల కాదు. తిరిగి సోమవారం రిలీజ్ అవుతుంది. సోమవారం 3 జనవరి 2022, ఎపిసోడ్ 205 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి కోచింగ్ సెంటర్ లో నిర్వహించిన పరీక్షలో సెకండ్ వచ్చిందని అభి ఇంటికి వచ్చి జానకికి చెబుతాడు. దీంతో జానకి చాలా సంతోషిస్తుంది. ఫస్ట్ కూడా ఒక్క మార్కుతో మిస్ అయిందని చెబుతాడు అభి. ఏది ఏమైనప్పటికీ.. సెకండ్ రావడంతో రామా, జానకి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. రేపు అకాడమీలో జరగబోయే ఇన్సిపిరేషన్ మీటింగ్ లో ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్లకు పోలీస్ క్యాప్ ప్రజెంట్ చేస్తారని చెప్తాడు అభి. అలాగే.. తనకు కోచింగ్ ఫీజులోనూ రాయితీ ఇస్తారని.. ఇదంతా కేవలం మీవల్లే అని రామాను పొగిడేస్తుంది జానకి. దీంతో రామా ఉండబట్టలేక అభి ముందే.. జానకికి కిస్సుల మీద కిస్సులు ఇస్తాడు.

janaki kalaganaledu 3 january 2022 episode

janaki kalaganaledu 3 january 2022 episode

అభి వెళ్లిపోయాక జానకి రామాకు నుదుటి మీద ముద్దు ఇస్తుంది. ఆ తర్వాత సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాత్రి అవుతుంది. జ్ఞానాంబ, గోవిందరాజు.. ఇద్దరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటూ ఉంటారు. జ్ఞానాంబ, గోవిందరాజుకు జానకి వడ్డిస్తుంటే.. జ్ఞానాంబ ఆపుతుంది. జానకి ఆగు. నువ్వు వడ్డించకు. వెళ్లి మల్లికను పిలువు అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి భయపడుతుంది. ఏమైంది అత్తయ్య గారు. నేను ఏమైనా పొరపాటు చేశానా అంటుంది. అదేం లేదమ్మా.. నువ్వు వెళ్లి మల్లికను పిలువు అంటుంది. దీంతో జానకి మల్లికను పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారు పిలిచారు అంటుంది మల్లిక. అన్నం వడ్డించు అనగానే మీ ముద్దుల కోడలుతో రోజూ వడ్డించుకుంటారు కదా.. ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది మల్లిక. అవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకు నువ్వు వడ్డించవా అని అడుగుతుంది. సరే.. అని ఓవర్ యాక్షన్ చేస్తూ వడ్డిస్తుంటుంది మల్లిక.

నీకు జానకి అంటే ఎందుకు అంత కోపం అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో ఏంటి అత్తయ్య గారు ఆ మాటలు.. జానకి నాకు తోటి కోడలు అయినా తను నాకు తోబుట్టువుతో సమానం అంటుంది మల్లిక. మరి.. తను నీ తోబుట్టువు అయితే పూజ మధ్యలో ఎందుకు వచ్చేశావు అని అడుగుతుంది.

పెద్ద కోడలుతో పూజ చేయిస్తానని మీరు అన్నప్పుడు జానకి డైరెక్ట్ గా పూజలో కూర్చొని పూజ చేయొచ్చు కదా. కానీ.. నన్ను కూడా పిలిచి.. అందరి ముందు నన్ను అవమానించింది జానకి అంటుంది. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉంటే చెప్పు. పెద్దవాళ్లుగా మేము పరిష్కరిస్తాం అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 3 Jan Episode Hightlights : తన బట్టలు కూడా ఉతకాలంటూ మల్లికకు శిక్ష విధించిన గోవిందరాజు

దీంతో జానకి మీద నాకెందుకు కోపం ఉంటుంది అత్తయ్య గారు. తను అబద్ధాలే ఆడదు. జానకి వాళ్ల అన్నయ్య కూడా చరిత్రలో నిలిచిపోయే నిజాయితీ పరుడు.. అంటూ మల్లిక ఏదేదో చెప్పబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన రామా.. మల్లిక కాస్త నోరు అదుపులో పెట్టుకో అంటుంది.

అమ్మ నిన్ను అడిగే విషయం ఏంటి.. నువ్వు మాట్లాడే విషయం ఏంటి.. అంటూ సీరియస్ అవుతాడు రామా. నువ్వు చేసిన మోసం గురించి చెబితే.. మోసం గురించి నువ్వు మాట్లాడటం ఏంటి.. అనగానే అందరూ షాక్ అవుతారు. నువ్వు చేసిన మోసం బయటపెడితే అన్నాడు ఏంటి కొంపదీసి.. పూతరేకుల మ్యాటర్ తెలిసిపోయిందా ఏంటి అని టెన్షన్ పడుతుంది మల్లిక.

ఏం చేసింది తను అంటూ అడుగుతారు జ్ఞానాంబ, గోవింద రాజు. ఇంతలో విష్ణు అక్కడికి వచ్చి నేను చెబుతాను అంటాడు. తను ఈరోజు అమ్మ చీర ఉతకను అని పక్కన పడేసింది అంటాడు విష్ణు. దీంతో తనకు గోవింద రాజు శిక్ష విధిస్తాడు.

ఇక నుంచి రోజూ నుంచి అత్తయ్య గారి బట్టలే కాదు.. నా బట్టలు కూడా ఉతికి ఇస్త్రీ చేయాలి.. అని మల్లికకు శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత అత్తయ్య ముందు ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతుంది విష్ణును. లేకపోతే నిన్ను అమ్మ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది అని చెబుతాడు విష్ణు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp