Janaki Kalaganaledu Monday Episode Highlights : తొందరపడ్డ రామా.. జానకి చదువు విషయం తెలుసుకున్న జ్ఞానాంబ.. ఇద్దరూ అబద్ధం చెప్పినందుకు.. వాళ్లకు జ్ఞానాంబ ఏ శిక్ష విధిస్తుంది?

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
Janaki Kalaganaledu Monday Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ శనివారం, ఆదివారం ప్రసారం కాదు. కేవలం.. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
అయితే.. శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సోమవారం అంటే 30 ఆగస్టు 2021, ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
శుక్రవారం ఎపిసోడ్ లో జానకిని జ్ఞానాంబ తిట్టిన విషయం తెలిసిందే. సమాయానికి పనివాళ్లు రాకపోయే సరికి.. జ్ఞానాంబ.. జానకిని తిడుతుంది. నిన్ను నమ్మడం నా బుద్ది తక్కువ అని చెబుతుంది. అయితే.. పనివాళ్లను జానకి పిలిచినప్పటికీ.. పనివాళ్లు రాకుండా.. మల్లిక అడ్డుకున్న విషయం ఎవ్వరికీ తెలియదు.
Janaki Kalaganaledu Monday Episode Highlights : పనివాళ్లు రాకపోవడంతో జానకిపై జ్ఞానాంబ సీరియస్
దీంతో పని వాళ్లు వస్తారని.. వెంటనే రావాలని చెప్పానని జానకి జ్ఞానాంబతో అంటుంది. వచ్చేవాళ్లు అయితే ఎప్పుడో రావాలి. ఇంకా రాలేదు ఎందుకు. వాళ్లు పని ఎగ్గొట్టారు. ఇప్పుడు సమయానికి స్వీట్ల అందివ్వకపోతే.. ఆ బాబ్జీకి ఏం సమాధానం చెప్పాలి.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
నా పరువు అంతా తీసేశావు. నిన్ను నమ్మాను.. చూడు.. నామీద నాకే అసహ్యం వేస్తోంది. 25 ఏళ్ల నమ్మకాన్ని ఒక్క ఆర్డర్ తో గంగలో కలిపేశావు. నేను వద్దు అని వారిస్తున్నా కూడా.. ఒక్కరోజులో స్వీట్లు తయారు చేసి ఇస్తా.. అని చెబితే నిజమేనని నమ్మా.. ఇప్పుడు తెలిసింది.. ఇక నిన్ను జన్మలో కూడా నమ్మొద్దని.. అని అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
Janaki Kalaganaledu Monday Episode Highlights : పనివాళ్ల కోసం ఊళ్లోకి వెళ్లిన జానకి
అసలు.. ఏం జరిగింది? పనివాళ్లు ఎందుకు రాలేదో తెలుసుకోవడం కోసం జానకి ఊళ్లోకి వెళ్లి వస్తా… అని చెప్పి వెళ్తుంది. అక్కడికి వెళ్తుంది కానీ.. పనివాళ్లు ఇండ్లు తనకు తెలియదు. వాళ్లకు ఫోన్ చేస్తేనేమో.. స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఏం చేయాలి.. ఏం చేయాలి.. అని ఆలోచించి.. వెంటనే తనకు తెలిసిన వ్యక్తి రంగయ్య ఇంటికి వెళ్తుంది.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
రంగయ్య.. ఓ స్వీట్ షాపులో పనిచేస్తాడు. దీంతో అతడి దగ్గరికి వెళ్లి.. స్వీట్ల తయారీకి మనుషులు కావాలని అడుగుతుంది. దీంతో మీరు చేసిన సాయం నేను ఏనాటికీ మరిచిపోలేను అమ్మా. మీరు నిశ్చింతగా ఉండండి. పనివాళ్లను నేను పంపిస్తా.. అని తనకు దైర్యం చెప్పి పంపిస్తాడు రంగయ్య.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
Janaki Kalaganaledu Monday Episode Highlights : పనివాళ్లను పంపించిన రంగయ్య
కట్ చేస్తే.. 10 నిమిషాల్లో పది మంది కుర్రాళ్లు.. సైకిళ్లు వేసుకొని ఖార్ఖానాకు వెళ్తారు. జానకి అమ్మగారు పంపించారని చెబుతారు. వెంటనే పని మొదలు పెడుతారు. దీంతో జ్ఞానాంబ సంతోషం వ్యక్తం చేస్తుంది.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
జానకి కూడా ఖార్ఖానాకు వచ్చి.. పని మొదలు పెడుతుంది. అనుకున్న సమయానికంటే ముందే స్వీట్ల ఆర్డర్ ను డెలివరీ చేస్తుంది జానకి. దీంతో జ్ఞానాంబ చాలా సంతోషపడుతుంది.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
జానకి చేసిన పనికి మెచ్చుకుంటుంది. నాకు నీమీద నమ్మకం ఉంది. నువ్వు ఏ పని అయినా అనుకుంటే సాధిస్తావు. ఇప్పుడు నా ఇంటిని కూడా నువ్వే చూసుకోగలవు.. అనే నమ్మకం వచ్చింది.. అని అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
Janaki Kalaganaledu Monday Episode Highlights : తొందరపడి నోరుజారిన రామా
అయితే.. అందరూ సంతోషంగా ఉన్నసమయంలో.. రామా తొందరపడి.. నోరు జారుతాడు. జానకి చాలా తెలివైనది.. ఎందుకంటే.. తను బాగా చదువుకుంది కదా.. అని అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి.. జానకి.. చదువుకుందా? ఏం మాట్లాడుతున్నావు రామా నువ్వు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో రామాకు ఏం చెప్పాలో అర్థం కాదు. మల్లిక కూడా షాక్ కు గురవుతుంది.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news
జానకి చదువు విషయం జ్ఞానాంబకు తెలుస్తుందా? తెలిస్తే.. జ్ఞానాంబ ఏం చేస్తుంది? జానకిని ఇంట్లో నుంచి పంపిస్తుందా? అబద్ధం చెప్పినందుకు వాళ్లకు ఏ శిక్ష వేస్తుందో తెలియాలంటే.. సోమవారం ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.

Janaki Kalaganaledu 30 august 2021 episode 116 latest news