Janaki Kalaganaledu 30 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ 30 ఆగస్టు 2021, సోమవారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. ఎపిసోడ్ 116 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి మొత్తం కష్టపడి స్వీట్లు తయారు చేస్తారు. జ్ఞానాంబతో పాటు అందరూ పనుల్లో పాల్గొంటారు. మల్లిక కూడా ఏదో పనులు చేస్తున్నట్టు యాక్షన్ చేస్తుంటుంది. జానకి, రామా, మిగితా కుటుంబ సభ్యులు, పనివాళ్లు రాత్రంతా కష్టపడి పని చేసి స్వీట్లు తయారు చేస్తారు. మొత్తానికి స్వీట్ల తయారీ ప్రక్రియ పూర్తవుతుంది.
రామా కష్టపడి స్వీట్లు తయారు చేస్తుంటే.. పొగకు చెమటలు పడుతుంటాయి. దీంతో టవల్ తో అతడి ముఖాన్ని తూడ్చుతుంది జానకి. స్వీట్లు తయారు చేస్తున్నంత సేపు.. బ్యాక్ గ్రౌండ్ లో ఓ పాటను ప్లే చేస్తారు. మొత్తానికి స్వీట్లను తయారు చేసి.. ప్యాక్ చేసి.. వాహనంలో లోడ్ చేస్తారు.
ఇక.. మల్లిక అస్సలు తట్టుకోలేకపోతుంది. విష్ణు కూడా తెగ ఆవేశపడి పని చేస్తుంటే.. చాలు.. ఇక నువ్వు చేసింది చాలు. ఇక్కడ ఉండండి.. అని వారిస్తుంది మల్లిక. సమయానికి స్వీట్లు డెలివరీ చేయడంతో.. జానకి.. తెగ సంతోషిస్తుంది. రామాను చూసి మనం సాధించాం అని అంటుంది. జ్ఞానాంబ కూడా జానకిని చూసి సంతోషపడుతుంది.
కట్ చేస్తే.. మల్లిక ఏదో కోల్పోయిన దానిలా.. ఇంటికి వచ్చి ఏడుస్తూ నా 30 వేలు పాయే.. అని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇంతలోనే జ్ఞానాంబ వచ్చి ఏమైంది.. తెగ ఏడుస్తున్నావు.. అనగానే.. ఖార్ఖానాలో పని చేసి.. ఓపిక పోయింది అత్తయ్య గారు అంటుంది.
ఓయమ్మో.. నువ్వు అటూ ఇటూ తిరగడం తప్పితే ఇక పని ఎప్పుడు చేశావు అంటుంది జానకి. ఇంతలోనే ఇంటికి రామా, జానకి వస్తారు. జ్ఞానాంబ భర్త కూడా అక్కడే ఉంటాడు. జానకిని చూసి.. అమ్మా జానకి ఇటురా అమ్మా ఒకసారి అని చెప్పి.. ఏంటి అత్తయ్య గారు అని అడుగుతుంది. ఇలా కూర్చో అమ్మా.. అని చెప్పి.. ఏమీ అనుకోకు అని అంటుంది జ్ఞానాంబ.
ఎందుకు అత్తయ్య గారు.. అయినా మీరెందుకు అలా అంటున్నారు.. అని అడుగుతుంది జానకి. పనివాళ్లు రాలేదన్న కోపంతో.. అందరి ముందు నిన్ను తిట్టాను. నీ మనసు చాలా గాయపడి ఉంటుందని నాకు తెలుసు.. అనగానే.. లేదండి.. మీ కోపంలో కూడా ప్రేమ ఉంటుందని మీ అబ్బాయి గారు ఎప్పుడూ చెబుతుంటారు. ఆ క్షణం, మీ మాటల్లోనూ, కోపంలోనూ.. అర్థం ఉంది.. అని అంటుంది జానకి.
అన్నింటికి మించి.. నన్ను అనే హక్కు మీకుంది. దయచేసి.. ఇంకెప్పుడు మీరలా చెప్పకండి అత్తయ్య గారు.. అని అడుగుతుంది జానకి.
అత్తారింటికి వచ్చిన కోడలికి ఆ ఇంటి మీద బాధ్యత ఉండాలి.. అంటే అందరూ నా వాళ్లు.. ఇది నా ఇల్లు అనే ప్రేమ ఉండాలి. ఒకరి గురించి నాకెందుకు.. నేను మాత్రమే అనే స్వార్థం ఉండకూడదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. నీలో నన్ను చూసుకున్నాను.
లాభాల సంగతి పక్కన పెడితే.. జ్ఞానాంబ స్వీటు షాపులో ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే.. చిటికెలో చేసి ఇస్తారు.. అనే నమ్మకాన్ని జనాల్లో కలిగేలా చేశావు. మన కొట్టును ఇంకో మెట్టు మీద నిలబెట్టావు.. అని జానకిని తెగ పొగిడేస్తుంది జ్ఞానాంబ.
నా కోడలిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.. అని అంటుంది జ్ఞానాంబ. నీ తెలివితేటలతో ఈ ఇంటిని నడిపించగలవనే నమ్మకం నాకు వచ్చేసింది జానకి అంటుంది జ్ఞానాంబ.
దీంతో అవునమ్మ.. జానకి గారు చాలా తెలివైన వారు. ఎందుకంటే.. అంత బాగా చదువుకున్నారు కదా.. అని నోరుజారుతాడు రామా. దీంతో ఏంటి.. జానకి చదువుకుందా? ఏం చదువుకుంది తను.. అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో అదేనమ్మా.. తను చదువుకుంది 5వ తరగతి అయినా కూడా.. సమాజంలో బతకడానికి చాలా తెలివితేటలు నేర్చుకున్నారు అని అంటున్నాను.. అమ్మ అని అంటాడు రామా.
ఆ నిజమేరా రాముడు.. చదువుకు, తెలివితేటలకు అస్సలు సంబంధం ఉండదు. నాకు కూడా చాలా తెలివి ఉంది. నేను పెద్దగా చదువుకోకపోయినా.. నా తెలివిని చూసి కూడా అందరూ తెగ ముచ్చటపడిపోతారు.. అని చెబుతాడు జ్ఞానాంబ భర్త.
కట్ చేస్తే.. సరే.. సరే.. పనిచేసి అందరూ అలసిపోయారు. త్వరగా వెళ్లి అందరూ పడుకోండి.. అని చెబుతుంది జ్ఞానాంబ. నువ్వు వెళ్లు జ్ఞానాంబ.. నేను వెళ్లి మందు వేసుకొని వస్తాను అంటాడు. పనిచేసి అలసిపోయాను.. కాబట్టి మందు వేసి వస్తాను. ఆ మందు కాదు.. ట్యాబ్లెట్లు అంటూ ఏదో అబద్ధం చెప్పబోయినా కూడా వినకుండా.. తన భర్తను లోపలికి తీసుకెళ్తుంది.
కట్ చేస్తే.. తెల్లారుతుంది. జ్ఞానాంబ ఉదయమే రెడీ అయి.. అందరినీ పిలుస్తుంది. రామా, జానకి, విష్ణు, మల్లిక అంటూ పిలుస్తుంది. వెన్నెల, అఖిల్.. అందరూ త్వరగా రండి అని పిలుస్తుంది. ఇంట్లోని వాళ్లందరినీ ఎందుకు పిలుస్తుంది.. అని చూస్తే.. అక్కడ చూస్తే అన్నీ స్వీట్లు ఉంటాయి. జానకి భర్త వాటిని చూసి తినేందుకు ట్రై చేస్తాడు. కానీ.. జ్ఞానాంబ హేయ్.. అంటూ ఆపుతుంది.
మల్లిక.. తొందరగా పదవే.. అంటాడు విష్ణు. కోర్టులో కేకలు వేసినట్టు.. ఏంటంటా.. మీ అమ్మకు అంత బాధ.. ఒకటే పిలుస్తోంది.. అని చెప్పి.. అక్కడికి వెళ్తారు. అందరూ అక్కడికి చేరుకుంటారు. చూస్తే.. అక్కడ రాఖీలు ఉంటాయి. రామా.. జానకి ఏది.. అని అడుగుతుంది జ్ఞానాంబ.
చూస్తే.. లోపల ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది జానకి. తన అన్నయ్యను గుర్తు తెచ్చుకుంటుంది. జానకి గారు.. ఏమైందండి.. ఎందుకు అలా ఉన్నారండి.. అని అడుగుతాడు రామా. అమ్మ పిలుస్తుంది అని చెప్పగానే వస్తుంది జానకి.
ఏమైందమ్మా.. అని జ్ఞానాంబ అడుగుతుంది. నన్ను క్షమించండి.. అత్తయ్య.. లేట్ గా వచ్చినందుకు అని అంటుంది. పర్వాలేదు కానీ.. గదిలో ఒంటరిగా ఎందుకు ఉండిపోయావు.. అని అడుగుతుంది.
సరేలే.. వెన్నెల మీ అన్నయ్యలు అందరికీ రాఖీలు కట్టు అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో తన అన్నయ్యలను ఇంట్లో కూర్చోబెట్టి రాఖీలు కడుతుంది వెన్నెల. రామాకు రాఖీ కట్టాక.. వెన్నెలకు జుంఖీలు కానుకగా ఇస్తాడు రామా. అన్నయ్య.. ఈ చెల్లి ముందు చూపించే ప్రేమ ముందు ఈ గిఫ్ట్ లు అన్నీ చాలా చిన్నవి అన్నయ్య. అమ్మలోని మొదటి అక్షరం, నాన్న లోని చివరి అక్షరం కలిపితే అన్న అంటారు. నిన్ను చూస్తే ఆ మాట ఎందుకు అంటారో అర్థం అవుతోంది. ఆ మాట నిజం అన్నయ్య. అమ్మ ప్రేమను పంచుతావు.. నాన్న బాధ్యతను పంచుతావు. ఇంత మంచి అన్నయ్య ఉండటం నిజంగా నా అదృష్టం.. అని చెబుతుంది వెన్నెల.
ఇంతలో మల్లిక తన భర్త దగ్గరకు వెళ్లి.. మీ చెల్లె మీద అంత ప్రేమ చూపించి.. వేలకు వేలు గిఫ్ట్ లు ఇవ్వకు.. ఓ ఐదో పదో.. ఇవ్వు అంతే.. అని అంటుంది మల్లిక. విష్ణుతో మల్లిక గుసగుసలు పెట్టడం చూసి జ్ఞానాంబ ఏంటి మల్లిక.. ఇప్పుడు ఏంటి మీ గుసగుసలు.. ఇటు వచ్చేయ్.. అంటుంది. దీంతో మల్లిక అక్కడి నుంచి వచ్చేస్తుంది.
వెన్నెల.. విష్ణుకు కూడా రాఖీ కడుతుంది. గిఫ్ట్ ఏది.. అని అడుగుతుంది వెన్నెల. దీంతో.. ఆగండాగండి. నా దగ్గర ఉన్నాయి.. అని చెబుతుంది మల్లిక. ఇదుగోండి.. ఈ 50 ఇవ్వండి.. అని చెబుతుంది మల్లిక.
కట్ చేస్తే.. జానకి.. తన అన్నయ్యకు రాఖీ కట్టలేదని తెగ బాధపడుతుంది. పాపం.. మీ అన్నయ్యకు రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయిందని నువ్వు లోలోపల కుమిలిపోతున్నావని నాకు తెలుసు జానకి.. అని అంటుంది మల్లిక. దీంతో రామా కలగజేసుకొని.. జానకి గారు.. వాళ్ల అన్నయ్యకు ఎప్పుడో రాఖీ కట్టేశారు అని చెబుతాడు రామా.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.