Janaki Kalaganaledu 31 Aug Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 31 ఆగస్టు 2021, మంగళవారం తాజాగా రిలీజ్ అయింది. లేటెస్ట్ ఎపిసోడ్ 117 హైలైట్స్ ఏంటో చూద్దాం.ఇంట్లో రాఖీ పండుగ జరుపుకుంటారు. వెన్నెల.. తన అన్నయ్యలు అందరికీ రాఖీ కడుతుంది. రామాకు, విష్ణుకు, అఖిల్ కు కూడా కడుతుంది. విష్ణు ఎక్కువ డబ్బులు ఇవ్వనీయకుండా.. 50 రూపాయలు ఇస్తుంది మల్లిక.
దీంతో నాకు డబ్బులు ఏం వద్దు.. నీ ప్రేమ ఉంటే చాలు.. అని చెబుతుంది వెన్నెల.కట్ చేస్తే.. మల్లిక.. అత్తయ్య గారు నేను మా ఇంటికి వెళ్లి మా తమ్ముడికి రాఖీ కట్టి వస్తాను.. అని చెబుతుంది. దీంతో నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. నేను మీ తమ్ముడిని ఇక్కడికి పిలిచాను.. అని చెబుతుంది. తన తమ్ముడు వచ్చి మల్లికతో రాఖీ కట్టించుకుంటాడు. నాకేమైనా తీసుకొచ్చావా? అని అడుగుతుంది మల్లిక. దీంతో నెక్లస్ తీసుకొచ్చా.. అని చెబుతాడు. నెక్లస్ తీసుకొని.. తెగ ఆనంద పడిపోతుంది మల్లిక.
అయ్యో.. ఏంటి జానకి.. బాధపడుతున్నావా? పాపం.. మీ అన్నయ్యకు రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయినందుకు నువ్వు లోలోపల కుమిలిపోతున్నావని నాకు తెలుసు జానకి. ఏంటో.. కానీ ఏం చేస్తాం. మీ అన్నయ్య ఏమో.. ఏడు సముద్రాల అవతల.. నువ్వేమో.. గోదావరి ఒడ్డుకు ఇవతల.. టైమ్ లేక కాదు.. టైమ్ బాగోలేక అన్నట్టు.. నీకు అన్నయ్య ఉన్నా లేనట్టే.. ఆ దేవుడు నీకు ఆ ఆదృష్టం రాసిపెట్టలేదు.. ఏం చేస్తాం. అయినా ఈ సంవత్సరం అనే కాదు. ప్రతిసంవత్సరం అలాగే ఉంటుందేమో.. ఎందుకైనా మంచిది గుండెను రాయి చేసుకో జానకి… అంటుంది మల్లిక.
మల్లిక.. ఆ పుల్ల విరుపు మాటలు ఆపుతావా? అని జ్ఞానాంబ మల్లికను హెచ్చరిస్తుంది. మల్లికా.. జానకి గారు వాళ్ల అన్నయ్యకు ఎప్పుడో రాఖీ కట్టేశారు.. అని రామా చెబుతాడు. ఎప్పుడు పోయిన సంవత్సరమా? అని అడుగుతుంది మల్లిక. అంటే.. ఈ సంవత్సరమే.. ఈ రోజే.. అని చెబుతాడు రామా. ఏంటి.. నమ్మడం లేదా.. అని చెప్పి.. అందరూ ఒకసారి రండి అని ఫోన్ తీసి.. వీడియో కాల్ చేస్తాడు.
తన అన్నను చూసి కన్నీళ్లు కారుస్తుంది జానకి. అందరూ బాగున్నారా? అత్తయ్య గారు.. మామయ్య గారు నమస్కారం అని చెప్తాడు. నువ్వు అమెరికా వచ్చాక మీ అన్నయ్య కళ్లలో నిజమైన సంతోషాన్ని ఈరోజే చూశానమ్మా.. దానికి కారణం.. నువ్వు పంపించిన రాఖీ.. అని తన వదిన చెబుతుంది. రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నయ్య అని చెబుతుంది జానకి. థాంక్యు అని చెప్తాడు తన అన్నయ్య.
నీకో విషయం తెలుసా జాను. నువ్వు పంపించిన రాఖీ కట్టుకొని ఇండియా నుంచి మా చెల్లెలు రాఖీ పంపించిందని.. ఇక్కడ మీ అన్నయ్య అందరికీ చూపిస్తూ.. మీ అన్నయ్య ఎంత సంతోషపడిపోతున్నారో తెలుసా? మాకు ఇంత సంతోషాన్ని అందించావు.. అని చెబుతుంది తన వదిన.
జానూ.. నిన్ను వదిలేసి వచ్చాను కదా.. నా మీద నీకు కోపం ఉందేమో అని అనుకున్నా. కానీ.. నా చెల్లిలికి ఈ అన్నయ్య మీద ఇంకా ప్రేమ ఉందని నిరూపించావు.. అని చెప్తాడు జానకి అన్నయ్య. మళ్లీ ఫోన్ చేస్తాను బావ గారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రామా. మల్లిక ఇప్పుడు ఏమంటావు అని చెప్పి.. మల్లికకు సరైన సమాధానం చెబుతాడు రామా.
కట్ చేస్తే.. మల్లిక తమ్ముడు మధన్, వెన్నెల కలిసి కూర్చొని పిచ్చాపాటీగా మాట్లాడుతుంటారు. నువ్వేంటి.. మీ అక్కకు చెప్పకుండా వచ్చేశావు.. అని అడుగుతుంది వెన్నెల. నీ జాబ్ ఎలా ఉంది.. అని అడుగుతుంది. జాబ్ ఏం బాలేదు. ఇంటికే వచ్చి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా.. అని చెబుతాడు మధన్. ఇంతకీ నీ పెళ్లి అప్పుడు అని అడుగుతుంది వెన్నెల. ఇంతలో మల్లిక వచ్చి.. కోటి రూపాయలు ఇచ్చే అమ్మాయి దొరికితేనే పెళ్లి.. అని చెబుతుంది మల్లిక.
కట్ చేస్తే.. కోట్టులో ఉన్న రామా.. ఫోన్ లో మాట్లాడుతూ.. ఆర్డర్ చేస్తుంటాడు. ఇంతలో ఫుల్ ఖుషీతో జానకి వచ్చి.. రామాను కౌగిలించుకొని.. ఏమండి.. అని గట్టిగా అరుస్తూ.. అతడికి ముద్దు పెడుతుంది. ఏమైంది జానకి.. అని అడుగుతాడు రామా. దీంతో షాక్ అయిపోతాడు రామా. ఏం మాట్లాడలేకపోతాడు. ఏమండీ.. అని పిలిచినా పలకడు.
ఈరోజును మీరు ఎంతో అద్భుతమైన రోజుగా అందించారు. అందుకే మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియక.. ముద్దు ఇచ్చాను.. అని చెబుతుంది జానకి. మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు.. అని అడుగుతాడు రామా. మా అన్నయ్య గురించి అని చెబుతుంది జానకి. మా అన్నయ్య నేను.. జీవితంలో కూడా మాట్లాడుకోము.. అని అనుకున్నాం కానీ.. మమ్మల్ని మీరే కలిపారు అని చెబుతుంది జానకి.కట్ చేస్తే.. అందరూ కలిసి ట్రాక్టర్ లో బయలు దేరి.. గుడికి వెళ్లి వ్రతం చేస్తారు.
అందరూ చాలా సంతోషంగా గడుపుతారు. జ్ఞానాంబ కాళ్లకు జానకి.. పసుపు రాస్తుంది. మొత్తం మీద ఫ్యామిలీ మొత్తం సంతోషంగా వ్రతంలో పాల్గొంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తరువాయి భాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.