Janaki Kalaganaledu 4 Nov Today Episode : మాధురి బతుకుతుందా? అఖిల్ గురించి జ్ఞానాంబకు చెబుతుందా? జానకి అఖిల్ ను అరెస్ట్ చేయిస్తుందా?

Authored By Varun G | The Telugu News | Updated on : 4 November 2022, 9:00 am

Janaki Kalaganaledu 4 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 నవంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 425 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మాధురికి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో మాధురి ఫోన్ నెంబర్ తీసుకొని మాధురి పేరెంట్స్ కు ఫోన్ చేస్తుంది జానకి. మీరు త్వరగా జనార్థన్ ఆసుపత్రికి రండి అని చెబుతుంది జానకి. దీంతో ఏమైందమ్మా అని అడుగుతుంది. దీంతో మీరు ముందు రండి.. నేను వచ్చాక చెబుతా అంటుంది. ఇంతలో మాధురి తల్లిదండ్రులు ఆసుపత్రికి వస్తారు. జానకి అంటే నువ్వేనా అంటారు. మీరు మాధురి పేరెంట్సా అని అడుగుతుంది. దీంతో అవును అంటారు. ఏమైంది మా అమ్మాయికి అని అడుగుతుంది. దీంతో ఒక పర్సన్ మీ అమ్మాయిని తల మీద కొట్టాడు అని చెబుతుంది. దీంతో షాక్ అవుతుంది. నా కూతురుకు ఎలా ఉంది అని అడుగుతుంది.

janaki kalaganaledu 4 november 2022 full episode

janaki kalaganaledu 4 november 2022 full episode

లోపల ట్రీట్ మెంట్ జరుగుతోంది. మీ అమ్మాయికి ఏం కాదు. కంగారు పడకండి అంటుంది. మా అమ్మాయి అసలు ఎవరి జోలికి పోదు. ఆమె మీద దాడి చేసిన ఆ దుర్మార్గుడు ఎవరమ్మా అని అడుగుతాడు తన తండ్రి. దీంతో ఇప్పుడే అఖిల్ గురించి చెప్పొద్దు అని ఎవరో తెలుస్తుంది లేండి అని అంటుంది. ఇంతలో డాక్టర్ వస్తుంది. మా అమ్మాయికి ఎలా ఉంది అని అడుగుతారు. దీంతో తల మీద గట్టిగా దెబ్బ తాకింది. దీంతో బతికే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతుంది డాక్టర్. డాక్టర్ గారు.. ప్లీజ్ డాక్టర్ గారు. ఎలాగైనా మా కూతురును బతికించండి అని డాక్టర్ ను బతిమిలాడుతుంది మాధురి అమ్మ. దీంతో మా ప్రయత్నం మేము చేస్తాం కానీ.. మీరు మాత్రం ధైర్యంగా ఉండక తప్పదు అంటుంది. దీంతో అయ్యో భగవంతుడా అంటూ కింద పడి ఏడుస్తుంది మాధురి తల్లి. వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కి అత్తారింటికి వెళ్లిపోతుందనుకున్న నాకూతురుకు ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చావేంటయ్యా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది మాధురి తల్లి.

మరోవైపు రాత్రి అయినా జానకి ఇంకా ఇంటికి రాలేదని జ్ఞానాంబ, రామా, గోవిందరాజు, జెస్సీ అందరూ వెయిట్ చేస్తుంటారు. అసలు జానకి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు. కొంపదీసి నా కడుపు గురించి సాక్ష్యాధారాలు సేకరించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్లిందా అని అనుకుంటుంది మల్లిక.

మరోవైపు జానకి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతాడు గోవిందరాజు. కాలేజీలో లేదు. ఓపక్క చీకటి పడుతోంది. అసలు ఏం జరిగి ఉంటుంది అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో అదే అర్థం కావడం లేదు అంటాడు రామా.

Janaki Kalaganaledu 4 Nov Today Episode : ఎందుకు లేట్ అయిందని ప్రశ్నించిన జ్ఞానాంబ

ఆలస్యం అవుతుందని కనీసం మనకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వకున్నా.. నువ్వు ఫోన్ చేసినప్పుడు అయినా తీయాలి కదా అంటుంది జ్ఞానాంబ. ఇంతలో జానకి వస్తూ ఉంటుంది. జానకిని చూసి అదిగో అక్కడ వచ్చేస్తుంది అంటుంది జెస్సీ.

పక్కన డాక్టర్ లేదేంటి అని అనుకుంటుంది మల్లిక. జానకి ఏదో పోయిన దానిలా బాధపడుతూ వస్తుంది ఇంట్లోకి. కాలేజీలో లేకుండా ఎక్కడికి వెళ్లిపోయారు జానకి గారు అని అడుగుతాడు రామా. కనీసం ఫోన్ చేసి అయినా చెప్పాలి కదా అని అడుగుతాడు గోవిందరాజు.

ఇంతలో అక్కడికి అఖిల్ వస్తాడు. అఖిల్ ను అలాగే చూస్తుంది జానకి. ఒక ఆడపిల్లను ఆల్ మోస్ట్ చంపేసేలా చేసి ఇంటికి వచ్చి నువ్వు చేసిన తప్పును కవర్ చేయాలని చేస్తున్నావా.. నీ దారుణాన్ని బయటపెట్టాలని ఉన్నా.. అత్తయ్య గారు తట్టుకోలేరని ఆగుతున్నా అని అనుకుంటుంది.

జానకి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో స్టడీ మెటీరియల్ తీసుకోవడానికి వెళ్లాను అత్తయ్య గారు. చెప్పకుండా మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టినందుకు క్షమించండి అంటుంది జానకి.

తన రూమ్ లోకి వెళ్లాక అఖిల్ గురించి రామాకు చెప్పాలా వద్దా అని అనుకుంటుంది. కానీ.. ఇప్పుడే చెప్పొద్దు అనుకుంటుంది. రామా ఏమైంది అని అడిగినా కూడా చెప్పదు. అసలు ఒకసారి అఖిల్ తో మాట్లాడి ఆ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి అని అనుకుంటుంది జానకి.

మరోవైపు మాల్ ఎలాగైనా అమ్మాలని అనుకొని పుస్తకాలు పట్టుకొని బయలుదేరుతారు అఖిల్. దీంతో ఇంతలో అక్కడికి వచ్చిన జెస్సీ ఎక్కడికి అని అడుగుతుంది. దీంతో చదువుకోవడానికి అని చెబుతాడు.

ఇంతలో జానకి వస్తుంది. జెస్సీ సంతోషిస్తుంది. నువ్వు చెప్పావని కెరీర్ మీద దృష్టి పెడుతున్నా వదిన అంటాడు అఖిల్. అఖిల్ కు టీ పెట్టి తీసుకురా అని జెస్సీని పంపించి అఖిల్ తో ఒంటరిగా మాట్లాడాలని అనుకుంటుంది జానకి.

అఖిల్.. నీకోసం ఎవరో పర్సన్ వచ్చారు. నీతోనే పర్సనల్ గా మాట్లాడాలట. బయట వెయిట్ చేస్తున్నారు అంటూ ఊరికే అలా అంటుంది జానకి. దీంతో అఖిల్ షాక్ అవుతాడు. నేను మాధురిని చంపానని తెలిసి ఎవరైనా వచ్చారా అని అనుకుంటాడు అఖిల్.

వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎవరూ లేరు కదా. వదిన ఏంటి ఇలా చెప్పింది అని అనుకుంటాడు అఖిల్. ఇంతలో బయటికి వచ్చిన జానకి.. నీకోసం ఎవరూ రాలేదు అని అంటుంది. దీంతో అఖిల్ షాక్ అవుతాడు.

మాధురి ఎవరు అని అడుగుతుంది. దీంతో మాధురి ఎవరు. నేను కాలేజీ దగ్గర కలవలేదు అంటాడు అఖిల్. నువ్వు మాధురిని వెంబడించడం నేను చూశా అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి