janaki kalaganaledu 7 february 2022 full episode
Janaki Kalaganaledu 7 Feb Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 ఫిబ్రవరి 2022, సోమవారం ఎపిసోడ్ 231 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామచంద్రాపురం వాళ్లు ఫోన్ చేసి మళ్లీ సంబంధం కలుపుకోవాలని చూడటంతో వెన్నెలకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు కుల దేవత దగ్గరికి రామా, జానకి కారులో వెళ్తుంటారు. మధ్యలో కారు ఆపుతాడు రామా. నావల్ల కాదు.. బాబోయ్ నేను తట్టుకోలేను.. అంటాడు రామా. ఎందుకు ఏమైంది. నా చూపులు నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాయా అంటుంది జానకి. కారు దిగి ఒక టీ తీసుకురా అంటాడు. విన్నావు కదా.. ఒక్కటంటే ఒక్కటే అంటాడు రామా. దీంతో జానకికి కోపం వస్తుంది. మేడమ్ టీ తాగరా సార్ అంటాడు టీ వ్యక్తి. ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. వాళ్లనెందుకు బలవంతపెట్టడం అంటాడు రామా.
janaki kalaganaledu 7 february 2022 full episode
ఏం అర్థం కాలేదు సార్ అంటాడు. ఇంతలో జానకి బాబూ.. కాఫీ ఉందా అని అడుగుతుంది. స్ట్రాంగ్ గా చాలా చాలా స్ట్రాంగ్ గా కాఫీ తీసుకురా. మా ఆయన మీద చాలా స్ట్రాంగ్ గా గొడవ పడాలి అంటుంది. కాఫీ తెచ్చి ఇస్తాడు. వావ్ సూపరమ్మా అంటుంది జానకి. తను టీ తాగిన డబ్బులు తాను ఇచ్చేస్తాడు రామా. జానకి తాగిన కాఫీకి కూడా డబ్బులు ఇవ్వమని అడుగుతాడు టీ వ్యక్తి. దీంతో ఎవరు తాగిన డబ్బులు వాళ్లే ఇచ్చుకోవాలి.. అంటాడు రామా. నా దగ్గర డబ్బులు లేవని తెలిసి కూడా నన్ను ఆటపట్టిస్తారా.. చెబుతాను ఉండండి మీ సంగతి. ఇది మీరు నాకు గుర్తుగా ఇచ్చిన ఉంగరం. చూడండి.. మిమ్మల్ని ఎలా ఆటపట్టిస్తానో. బాబు ఇది మా ఆయన నాకు ప్రేమగా ఇచ్చిన ఉంగరం.. నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను తీసుకో అంటుంది జానకి. దీంతో ఇచ్చేయండి మేడమ్.. ఇచ్చేయండి అంటాడు టీ వ్యక్తి.
నువ్వు ఆగవయ్యా. 20 రూపాయల కోసం ఉంగరాన్నే ఇచ్చేస్తారా అంటాడు రామా. ఏం కాదు నువ్వు తీసుకో అంటుంది జానకి. దీంతో థాంక్యూ మేడమ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతాడు టీ వ్యక్తి. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు.
వెంటనే అతడి దగ్గరికి వెళ్లి ఇదిగో ఆ 20 రూపాయలు తీసుకొని ఆ ఉంగరం ఇచ్చేయ్ అంటాడు. ఏ ఉంగరం అంటాడు. అది మేడమ్ గారు ఇచ్చిన ఉంగరం.. నేను ఇవ్వను సార్ అంటాడు. చివరకు అతడని బతిమిలాడి వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ ఉంగరం తీసుకొచ్చి జానకి చేతుల్లో పెడతాడు.
కొన్ని జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలి. కాఫీల కోసం కాకరకాయల కోసం ఇచ్చేయకూడదు అంటాడు రామా. ఆ తర్వాత ఇద్దరూ గుడికి వెళ్తారు. దేవుడిని దర్శించుకున్న తర్వాత పూజారిని కలుస్తారు. నాకు జ్ఞానాంబ గారు ఫోన్ చేశారు. అన్ని చెప్పారు అని చెబుతాడు.
కోనేటి నుంచి నీటిని తీసుకొచ్చి పూజ మొదలు పెట్టండి అని పూజారి చెబుతాడు. దీంతో బింద పట్టుకొని జానకి కోనేరు దగ్గరికి వెళ్తుంది. రామా మాత్రం తనకు ఏం సాయం చేయడు. బిందెలో నీళ్లు తీసుకొని వెళ్లబోతుండగా కిందపడబోతుంది జానకి. దీంతో తనను పట్టుకుంటాడు రామా.
ఆ తర్వాత పూజలో తనకు సాయం చేస్తాడు. అయితే.. తన కాలికి దెబ్బతాకింది అని చెప్పి యాక్షన్ చేస్తుంది. దీంతో తనను ఎత్తుకొని తీసుకెళ్తాడు రామా. మరోవైపు నాయనమ్మకు బాగోలేదు అని చెప్పి రిసార్ట్ కు వెళ్లి మల్లిక, విష్ణు ఎంజాయ్ చేస్తుంటారు.
కట్ చేస్తే వెన్నెల రూమ్ కు వెళ్లిన జ్ఞానాంబ.. తన రూమ్ లో లవ్ లెటర్స్ చూస్తుంది. ఎక్కడ చూసినా డీ అనే పేరు ఉండటం చూసి షాక్ అవుతుంది. తన డెస్క్ లో ఫోటోను కూడా చూస్తుంది. దీంతో తన ప్రేమ విషయం జ్ఞానాంబకు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.