Janaki Kalaganaledu 8 July Today Episode : ఏరువాక పండుగలో అపశృతి.. జానకికి ప్రమాదం.. మల్లిక ప్లాన్ సక్సెస్.. జానకిని రామా కాపాడుతాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 8 July Today Episode : ఏరువాక పండుగలో అపశృతి.. జానకికి ప్రమాదం.. మల్లిక ప్లాన్ సక్సెస్.. జానకిని రామా కాపాడుతాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :8 July 2022,11:30 am

Janaki Kalaganaledu 8 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 340 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటికి వచ్చాక భార్యను కాస్త అయినా పట్టించుకోవాలి అంటుంది జానకి. రామా దగ్గరికి వచ్చి ముద్దు పెట్టబోతుంది. మీ కళ్లలోకి చూస్తూ ఈ లోకాన్ని మరిచిపోవాలని ఉంది.. అంటుంది. వీళ్ల మాటలన్నీ బయటి నుంచి వింటూ ఉంటుంది మల్లిక. ఏదో ఒకటి చేయకపోతే ఐదు సెంట్లు గోవిందా అని అనుకుంటుంది మల్లిక. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకొని పక్కనే ఉన్న వస్తువును కింద పడేసి వెళ్లిపోతుంది మల్లిక. దీంతో రామా, జానకి ఇద్దరూ డిస్టర్బ్ అవుతారు. నాకు నిద్ర వస్తోంది. నేను వెళ్లి పడుకుంటా అంటాడు రామా. వీళ్ల ఏకాంతాన్ని చెడగొట్టాను. నేను అర్జెంట్ గా వెళ్లి పిల్లలను కనేయాలి అని అనుకొని అరటిపళ్లను తీసుకొని తన రూమ్ లోకి వెళ్తుంది.

janaki kalaganaledu 8 july 2022 full episode

janaki kalaganaledu 8 july 2022 full episode

మల్లికను చూసి విష్ణు షాక్ అవుతాడు. ఏమైంది.. ఇప్పుడే కదా మెక్కావు. మళ్లీ అరటిపండ్లు తింటున్నావు అని అడుగుతాడు. దీంతో జానకి, బావ ఏకాంతాన్ని చెడగొట్టా అని చెప్పి తెగ అరటిపండ్లు తినేస్తుంది జానకి. మల్లిక ఆగు అననా కూడా ఆగదు మల్లిక. మనకు పిల్లలు పుట్టాలని కోరుకోవాలి కానీ.. వాళ్లకు పుట్టకూడదు అని కోరుకోవడం ఏంటి అని అడుగుతాడు విష్ణు. దీంతో మనకంటే ముందు వాళ్లు పిల్లలను కంటే 5 సెంట్ల భూమి పోయినట్టే. అంటే 20 లక్షలు గోవిందా అంటుంది. మరేమో అంటూ తెగ సిగ్గుపడిపోతుంటుంది మల్లిక. మనం త్వరగా పిల్లలను కనేసి ఆ 5 సెంట్లు కొట్టేద్దాం అండి అంటుంది మల్లిక. చూపే బంగారం ఆయనే అంటూ పాట పాడబోతూ అరటిపండు తొక్క మీద కాలు వేసి జారిపడుతుంది మల్లిక.

కట్ చేస్తే.. కుటుంబ సభ్యులను అందరినీ పిలుస్తుంది జ్ఞానాంబ. ఈరోజు ఏరువాక పండుగ. పొలంలో ఏరువాక సాగాలి. పూజలు చేయాలి అని చెబుతుంది జ్ఞానాంబ. ఈరోజు సాయంత్రం వరకు పొలంలోనే ఉండి మనం సంబురాలు చేసుకుందాం అని చెబుతుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 8 July Today Episode : పొలంలో ఏరువాక పండుగ జరుపుకున్న జ్ఞానాంబ ఫ్యామిలీ

తొందరగా రెడీ అయి రండి అని అందరికీ చెబుతుంది జ్ఞానాంబ. అందరూ రెడీ అయి పొలానికి బయలుదేరుతారు. రామా, జానకి బైక్ మీద వెళ్తుంటారు. అయితే.. జానకి చదువుకు రోజూ ఆటంకం ఏర్పడుతోంది అని మనసులో బాధపడతాడు రామా. అసలు టైమే సరిపోవడం లేదు అని అనుకుంటాడు.

రామా గారు.. ఏంటి మీరు ఏం మాట్లాడటం లేదు అని అడుగుతుంది. ఏం లేదు అంటాడు రామా. తర్వాత పొలం దగ్గరికి అందరూ వెళ్తారు. అక్కడ ఏరువాక పండుగ కోసం పూజలు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. పూజ నిర్వహించిన తర్వాత మగవాళ్లు పలుగు, పార పట్టుకొని తవ్వాలి.. ఆడవాళ్లు అందరూ విత్తనాలు నాటాలి అని చెబుతుంది జ్ఞానాంబ.

విత్తనాలు నాటేటప్పుడు ఎలాంటి అడ్డంకులు రాకూడదు అని అంటుంది. జానకి, మల్లిక ఆ విత్తనాలు తీసుకోండి అని అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అంటారు. అందరూ విత్తనాలు తీసుకొని బయలు దేరుతారు. పలుగు, పార తీసుకొని రామా, విష్ణు ఇద్దరూ భూమిని తవ్వుతూ ఉంటారు. జానకి, మల్లిక, జ్ఞానాంబ ముగ్గురూ విత్తనాలు వేసుకుంటూ వెళ్తుంటారు.

కానీ.. విత్తనాలు నాటేటప్పుడు ఎలాంటి ఆటంకాలు జరగకూడదని జ్ఞానాంబ చెప్పిన విషయం మల్లికకు గుర్తొస్తుంది. దీంతో జానకిని జ్ఞానాంబతో తిట్టించాలని అనుకొని జానకి విత్తనాలు వేస్తూ వెళ్తుండగా తన కాళ్లతో జానకి కాళ్లకు అడ్డం పెడుతుంది. దీంతో తన కాళ్లు జారి అక్కడే ఉన్న గడ్డపార మీద పడబోతుంది జానకి.

ఇంతలో రామా వచ్చి తనను పట్టుకుంటాడు. దీంతో తను ప్రాణాలతో బయటపడుతుంది. వామ్మో.. ఏదో కింద పడుతుంది అని అనుకున్నా కానీ.. ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అనుకుంటుంది మల్లిక. అయినా విత్తనాలు అయినా పడిపోయి ఉంటాయి అని అనుకుంటుంది కానీ.. ఒక్క విత్తనం కూడా కింద పడదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది