Janaki Kalaganaledu 8 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 నవంబర్, 2021 సోమవారం 166 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపో జానకి.. ఆ మైరావతి నిన్ను ఖచ్చితంగా ఇంట్లో నుంచి పంపించేస్తుంది. వెంటనే వెళ్లిపో జానకి అంటుంది మల్లిక. కట్ చేస్తే.. మైరావతి తన ఇంట్లో పని వాళ్లతో పని చేపిస్తూ ఉంటుంది. తన భాష, మాట్లాడేతీరు, పనోళ్లతో మాట్లాడే తీరు, తన చీరకట్టు, తన తిండి.. అన్నీ విచిత్రంగా ఉంటాయి.
మా పిల్లలు అందరూ వస్తున్నారు. మీరంతా వాళ్లను దగ్గరుండి చూసుకోవాలి అని తన పనివాళ్లకు చెబుతుంది మైరావతి. ఇంతలో తన మనవళ్లు, మనవరాళ్లు వస్తారు. గుడ్ మార్నింగ్ నానమ్మ అంటారు. తనకు నమస్కారం చేయరు. దీంతో పెద్దోళ్ల ముందు బుద్ధిగా ఉండాలి.. అంటూ వాళ్లకు క్లాస్ పీకుతుంది. ఈరోజు మొదటి రోజు కాబట్టి వదిలేస్తున్నా. రేపటి నుంచి 5 గంటలకే లేవాలి అని అంటుంది. ఊరి చివర దాకా నడక నడిచి రావాలి లేదంటే మీ ఊరికి కారు, బస్సు కాదు.. నడుచుకుంటూ వెళ్లిపోతారు.. అంటుంది మైరావతి. మనల్ని పండక్కి పిలిచిందా.. పనిష్ మెంట్ కు పిలిచిందా? అర్థం కావడం లేదు అని అనుకుంటారు వాళ్లు.
ఇంతలో జ్ఞానాంబ ఫ్యామిలీ మొత్తం.. మైరావతి ఇంటికి కార్లలో వస్తారు. అమ్మా.. బాగున్నావా అని తన తల్లి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం కోరుతారు గోవిందరాజు, జ్ఞానాంబ. ఎలా ఉన్నారు అత్తయ్య గారు అని అడుగుతుంది జ్ఞానాంబ. నాకేంటే.. నేను బాగానే ఉన్నాను అంటుంది. నువ్వేంట్రా అలా చిక్కిపోయావు అంటుంది మైరావతి. ఇంతలో రామా.. తన దగ్గరికి వెళ్తాడు. రామయ్య.. అంటూ రామాను చూసి ఏడుస్తుంది మైరావతి. నీ పెళ్లి కళ్లారా చూడలేకపోయాను నాన్నా.. నేను నీ పెళ్లికి వస్తే అరిష్టం అని మన జ్యోతిష్కుడు చెప్పాడు. అందుకే నీ పెళ్లికి రాలేదురా అంటుంది మైరావతి. చాలా బాధపడుతున్నానురా. నా మనవడు సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలని పెళ్లికి రాకుండా ఇక్కడే ఉండిపోయాను అంటుంది మైరావతి.
జానకి వైపు చూసి ఏరా.. నీ పెళ్లామా అంటుంది. అవును అమ్మా.. జానకి గారు అంటుంది. ఆ.. గారా.. పెళ్లాం మొగుడికి మర్యాద ఇవ్వాలి.. మొగుడు పెళ్లానికి కాదు అంటుంది. ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. నానమ్మా నీ ఆశీర్వాదం ఇవ్వు నానమ్మా అంటుంది. జానకి దండం పెట్టడం చూసి.. హే పిల్లా ఏంటా దండం పెట్టడం. పెద్దోళ్లకు దండం పెట్టేటప్పుడు తల పాదాలకు తాకించి దండం పెట్టాలని తెలియదా? అంటుంది. ఏంటి జ్ఞానాంబ నీ కోడలుకు ఏం నేర్పించావు అంటుంది. ఇది నిజంగా నాతప్పే. నాకు తెలియదు అంటూ మరోసారి దండం పెట్టబోతుంది కానీ.. దండం పెట్టనీయకుండా లేచి రామా పక్కన నిలబడు అంటుంది మైరావతి.
మరోవైపు మల్లిక.. మైరావతి దగ్గరికి వెళ్లి అతివినయం ప్రదర్శిస్తుంది. తన గురించి తెలిసి.. ఏరా విష్ణు నీ పెళ్లానికి అతివినయం పోలేదా? అంటూ ఓ దెబ్బ వేస్తుంది. ఇది అతివినయం కాదు అమ్మమ్మ గారు అనగానే.. నీ అతి వినయం గురించి నాకు తెలుసు లేవే.. అంటూ మరో దెబ్బ వేస్తుంది.
ఒరేయ్ పెద్దోడా గోవిందం.. మనవళ్లు, మనవరాళ్లు అందరినీ ఇలా చూస్తుంటే నాకు ఆనందంతో కడుపు నిండిపోయిందిరా అంటుంది మైరావతి. దీపావళి రెండు రోజుల ముందే వచ్చినట్టు నాకు అనిపిస్తోందిరా. అంత సంతోషంగా ఉందిరా అంటుంది. వెళ్లి అందరూ స్నానాలు చేయండి అంటుంది. అందరూ లోపలికి వెళ్లిపోతారు. అయితే.. దీపావళి నోములు పూర్తయ్యే వరకు.. భార్యాభర్తలు ఒకే రూమ్ లో ఉండకూడదని మైరావతి ఆర్డర్ వేస్తుంది. దీంతో మల్లిక, జానకి.. ఇద్దరూ ఒకే గదిలో ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.