Janaki Kalaganaledu : బొక్కబోర్లా పడ్డాడు.. జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్‌ రచ్చ

 Authored By prabhas | The Telugu News | Updated on :18 March 2022,7:00 pm

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్‌తో అమర్ దీప్ బాగానే ఫేమస్ అయ్యాడు. రామచంద్ర పాత్రలో అమర్ దీప్ అద్భుతంగా నటించేస్తున్నాడు. అయితే అమర్ దీప్ ఎక్కువగా ఈటీవీ షోల్లోనే కనిపిస్తుంటారు. స్పెషల్ ఈవెంట్లు, పండుగలకు వచ్చే స్పెషల్ కార్యక్రమాల్లో సందడి చేస్తుంటాడు. అటు స్టార్ మా, ఇటు ఈటీవీ రెండింట్లోనూ మన రామచంద్ర అల్లరి చేస్తుంటాడు. తాజాగా హోళీకి సంబంధించిన ఈటీవీ ఈవెంట్‌లో అమర్ దీప్ బొక్కబోర్లా పడ్డాడు.

రంగ్ దే అంటూ ఈ హోళీకి ఈటీవీలో ఈవెంట్ రాబోతోంది. ఈ ఈవెంట్‌లో అందరూ కలిసి అలా బయటకు వెళ్లారు. అందరూ కలిసి ఆటలు ఆడుకున్నారు. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలను రెండు టీంలుగా విడగొట్టేశారు. రాం ప్రసాద్, ఆదిలు ఈ టీంలతో ఆటలు ఆడించినట్టు కనిపిస్తోంది. ఒంటి కాళ్లతో కుంటుకుంటూ వెళ్లి అవతలి టీం వాళ్లను పట్టుకోవాలనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా మొదటగా ఆడవాళ్ల టీం నుంచి ఒకరు వచ్చారు.

Janaki Kalaganaledu Amardeep Chowdhary In Holi 2022 rang de event in etv

Janaki Kalaganaledu Amardeep Chowdhary In Holi 2022 rang de event in etv

Janaki Kalaganaledu : కిందపడ్డ అమర్ దీప్..

చాలా వేగంగా ముందుకు వచ్చి ఒంటి కాలితో గెంతుతూ వెళ్లింది. అయితే ఎవ్వరూ కూడా ఆమెకు చిక్కలేదు. మగవాళ్ల టీం అంతా కూడా తప్పించుకున్నారు. చివరకు ఆమె కిందపడిపోయింది. ఆ తరువాత మగవాళ్ల టీం నుంచి అమర్ దీప్ వచ్చాడు. అతను కూడా చాలానే ప్రయత్నించాడు. కానీ అమ్మాయిలెవ్వరూ చిక్కలేదు. చివరకు అమర్ దీప్ బొక్కబోర్లా పడ్డాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు. మొత్తానికి ఈ ఈవెంట్ మాత్రం అదిరిపోయేలా ఉంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి