Actor Sivaji : మాట తప్పిన శివాజీ – నాకు అన్యాయం జరిగిందని ఏడ్చిన అమర్ దీప్ – ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actor Sivaji : మాట తప్పిన శివాజీ – నాకు అన్యాయం జరిగిందని ఏడ్చిన అమర్ దీప్ – ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..!

 Authored By anusha | The Telugu News | Updated on :26 November 2023,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Actor Sivaji : మాట తప్పిన శివాజీ - నాకు అన్యాయం జరిగిందని ఏడ్చిన అమర్ దీప్ -

  •  ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..!

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది . ఇక 12వ వారం కెప్టెన్సీ టాస్క్ లో హైడ్రామా నడిచింది. మరీ ముఖ్యంగా అమర్ దీప్ శివాజీ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. దీని గురించి నాగార్జున అమర్ దీప్ శివాజీ లను నిలదీశారు. శనివారం ఎపిసోడ్లో ముందు అమర్ ని నిల్చోబెట్టి వీడియోను చూపించారు. అందులో అమర్ అద్దం ముందు నిలబడి ఉన్న ఛాన్స్ కూడా పోయింది అని ఏడుస్తున్నాడు.

ఇక నాగార్జున అమర్ నువ్వే కదా సింపతి గేమ్ ఆడొద్దు అని చెప్పావు మరి ఇది ఏంటి అని అడిగారు. ఇది డ్రామా కాదు సార్. నమ్మిన వాళ్లు మాట తప్పారు. దీంతో నాకు అనుకోకుండా ఏడుపు వచ్చేసింది. నేను బయట కూడా అలానే ఉంటాను సార్ అని అమర్ చెప్పాడు. ఈ విషయంపై శివాజీని అడుగుదామని నాగార్జున అన్నారు. శివాజీ అమర్ ని కెప్టెన్ చేస్తానని మాట ఇచ్చావు. ఎందుకు మాట తప్పవు అని అడిగారు. దీంతో శివాజీ అవును సార్ అప్పుడు కూడా డిప్యూటీలని ఎవరిని పెట్టుకుంటావు అని అడిగితే వాళ్లనే చెప్పాడు. అందుకే ఇక అనవసరం అని మాట తప్పాను శివాజీ చెప్పాడు.

దీంతో నాగార్జున డిప్యూటీలలో శోభ, ప్రియాంకలను పెట్టుకుంటే ఏమైంది. నీకేంటి ప్రాబ్లం అని అడిగారు. ఇక శివాజీ బాగోలేదు సార్ న్యాయంగా బాలేదు అంటూ అన్నాడు. నువ్వు ప్రశాంత్, యావర్ ని తీసుకున్నప్పుడు అమర్ వాళ్ళిద్దరిని తీసుకుంటే తప్పేంటి అని నిలదీశారు. ఇంతలో అమర్ సార్ యావర్ అయినప్పుడు వాళ్లలోనే ఎలా తీసుకున్నాడో తర్వాత శివాజీ అన్న కూడా వాళ్ళని తీసుకున్నాడు అని అమర్ చెప్పాడు. అయితే నాగార్జున నువ్వు కెప్టెన్ అయిన వాళ్ళని అవ్వనివ్వనని చెప్పావు కదా మరి డిప్యూటీలు అయితే ఓకేనా అంటూ అమర్ ని నాగార్జున ప్రశ్నించారు. బ్యాచ్ కాదు కప్పు ముఖ్యం, దానికోసం ఆడు అని నాగార్జున అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది