Janaki Kalaganaledu : జ్ఞానాంబ అఖిల్, జెసిల పెళ్ళికి ఒప్పుకుంటుందా… జానకి జ్ఞానాంబకు ఏం చెప్తుంది…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 11 September 2022, 11:30 am

Janaki Kalaganaledu : బుల్లితెరపై ప్రసారమయ్యే జానకి కలగలేదు సీరియల్ . ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు.. సోమవారం ఎపిసోడ్ 386 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి జెస్సి ని తీసుకొని ఇంటికి రాగానే జ్ఞానాంబ ఏంటి జానకి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా. పూజ నీ చేతుల మీదనే జరగాలని నేను చెప్పాను కదా నా మాటకి విలువ లేకుండా చేస్తున్నావు అని తిడుతూ ఉండగా. మల్లిక తన తప్పు చేసేసింది తప్పులు కొట్టేయండి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది అప్పుడు జ్ఞానాంబ మల్లికను తిట్టి నువ్వు కొద్దిసేపు నోరు మూస్తావా అని అంటుంది. జ్ఞానాంబ అయినా ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు అసలు నువ్వు ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. అప్పుడు జానకి అత్తయ్య గారు నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. అని అఖిల్, జెసి ప్రేమా విషయాన్ని చెప్తుంది. అప్పుడు జ్ఞానాంబ నువ్వు ఏం మాట్లాడుతున్నావు జానకి. నీకు ఏమన్నా అర్థమవుతుందా.. అంటూ ఉండగా అఖిల్నీ పిలిచి అడుగుతారు. అప్పుడు అఖిల్ జరిగిందంతా చెబుతాడు. ఇక ఆకిల్, జెసి వెళ్లి జ్ఞానంబ కాళ్ళ మీద పడతారు.

జ్ఞానాంబ ససేమిరా ఒప్పుకోను అని అంటుంది. అంతలో జెసి అమ్మానాన్నలు వచ్చి మీరు మా అమ్మాయిని చేసుకోను అంటే నేను వెళ్లి కేసు పెడతాను. నా బిడ్డ ఇప్పుడు గర్భవతి నా బిడ్డని ఎవరు పెళ్లి చేసుకుంటారు. నా బిడ్డకు న్యాయం జరగాలి. లేదా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెడతాను వాళ్ళు చూసుకుంటారు అని జ్ఞానంబా ని బెదిరిస్తూ ఉంటారు. అప్పుడు జానకి మీరు తొందరపడకండి సార్ మీరు వెళ్లి కేసు పెట్టతే ఎవరి పరువు పోతుంది. ఒకసారి ఆలోచించుకోండి. జెసి పరువు పోతుంది పెళ్లి కాకుండా తల్లి అయింది అని అందరూ నానా మాటలు అనుకుంటూ ఉంటారు ఆవేశ పడకండి నిదానంగా మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు జానకి రూమ్ లోపలికి వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది.. అంతలో గోవిందరాజు వెళ్లి తనకి సర్ది చెప్తాడు. ఇలా చేశాడేంటండి అని జ్ఞానంబా బాగా బాధపడుతూ ఉంటుంది. అవును జ్ఞానం ఇలా చేస్తాడు అని మనం ఎవరిము అనుకోలేదు.. కానీ దానికి పరిష్కారం ఇప్పుడూ వాళ్ళిద్దరూ పెళ్లి చేయడమే అని అంటాడు. అప్పుడు బాధపడుతూ బయటికి వచ్చి పెళ్లికి సరే అని చెప్తుంది. అప్పుడు అఖిల్ జెసి సంతోషంతో పొంగిపోతూ ఉంటారు.

Janaki Kalaganaledu will What does Janaki tell gnanamba

Janaki Kalaganaledu will What does Janaki tell gnanamba

ఇక జెస్సి అమ్మానాన్నలు కూడా సంతోషపడిపోయి జ్ఞానాంబకి కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు. కానీ జ్ఞానంభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జానకి వెల్లి అత్తయ్య గారు బాధపడకండి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని అఖిల్ పోగొట్టుకున్నాడు. ఇక తన పెళ్లి అయిన తర్వాత తన చదువు విషయం నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను అని జ్ఞానాంబకి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక రామా కూడా వచ్చి ఏదో అయిపోయిందా అమ్మ నువ్వు దాని గురించి బాధపడకు తనకి కూడా న్యాయం జరగాలి కదా.. ఇక పెళ్లి తర్వాత జానకి గారు వాడి చదువు అంత దగ్గరుండి చూసుకుంటుంది. తను పెద్ద స్థాయిలోకి వెళ్లేలా చేస్తుంది. నువ్వు బాధపడకు అమ్మ అని రామా కూడా అంటాడు అప్పుడు అందరూ అలానే చెప్తారు.ఇక ఇంటికి వచ్చిన ముత్తైదులు తల ఒక మాట అంటూ వెళ్ళిపోతారు. మల్లిక మాత్రం జానకిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఎంతటి సమస్యనైనా ఈజీగా పరిష్కారం చేసేస్తుంది నిజంగానే నీది పోలీస్ బుర్ర అని మనసులో అనుకుంటూ తనని కుళ్లుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి