Janaki Kalaganaledu : మల్లికపై జ్ఞానాంబ సీరియస్.. కారణం అదేనా? జానకితో రామా శోభనానికి ఒప్పుకుంటాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : మల్లికపై జ్ఞానాంబ సీరియస్.. కారణం అదేనా? జానకితో రామా శోభనానికి ఒప్పుకుంటాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :17 July 2022,11:30 am

Janaki Kalaganaledu :  జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 18 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 346 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి పూట రామాతో జరిగిన విషయాన్ని గుర్తుచేసుకుంటుంది. రాత్రి పూట రామాతో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రామా, జానకి మంచి మూడ్ లో ఉండగా.. శోభనం చేసుకోబోతుండగా బుక్ కింద పడుతుంది. వెంటనే రామా డిస్టర్బ్ అవుతాడు. ఆ బుక్ కూడా నాకు నా బాధ్యతను గుర్తు చేస్తోంది అని జానకితో అంటాడు రామా.

janaki tempts rama to do first night with her

janaki tempts rama to do first night with her

దీంతో జానకి షాక్ అవుతుంది. ఓవైపు అత్తయ్యకు ఇచ్చిన మాట.. మరోవైపు తన ఐపీఎస్ కల.. ఎలా అంటూ బాధపడుతుంది. ఏం కాదు.. నేను అత్తయ్యకు ఇచ్చిన మాటను నెరవేర్చాలి. నేను పిల్లలను, ఐపీఎస్ కలను ఒకేసారి చూసుకుంటా అంటుంది జానకి. కానీ.. రామా మాత్రం అస్సలు వినడు. ముందు మీ ఐపీఎస్ కల నెరవేర్చుకోండి. ఆ తర్వాత మనం పిల్లల సంగతి చూద్దాం అని చెప్పి పడుకుంటాడు. అవన్నీ గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. ఎలాగైనా రామాతో ఏకాంతంగా గడపాలని భావిస్తుంది. అందుకే రామాకు ఫోన్ చేస్తుంది. రామాతో సరసాలు ఆడుతుంది.

Janaki Kalaganaledu : రామా, జానకి ఏకాంతాన్ని చెడగొట్టాలని మల్లిక ప్లాన్

మరోవైపు రామా కోసం ఎదురు చూస్తున్న జానకిని చూసి షాక్ అవుతుంది మల్లిక. మంచిగా రెడీ అయిన జానకిని చూసి షాక్ అవుతుంది. ఎలాగైనా రామా, జానకి ఏకాంతాన్ని చెడగొట్టాలని భావిస్తుంది. రామాకు ఫోన్ చేసినప్పుడు పూలు తీసుకురా అంటుంది జానకి.

ఇంతలో రామా పూలు తీసుకొని వస్తాడు. తనకోసం ఇంటి ముందుకు వెళ్తుంది జానకి. వీళ్లను గమనిస్తూ ఉంటుంది మల్లిక. ఇంతలో విష్ణు అక్కడికి వస్తాడు. వేడినీళ్లు పెట్టు అంటే విష్ణును పట్టించుకోదు జానకి. దీంతో జ్ఞానాంబ అవన్నీ గమనిస్తుంది.

జ్ఞానాంబ అవన్నీ గమనించి మల్లికను పిలిచి వార్నింగ్ ఇస్తుంది. విష్ణును ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది