
Janhvi Kapoor aggression she seems to surpass her mother in that matter
Janhvi Kapoor : దివంగత అందాల తార శ్రీదేవి తనయురాలు వారసురాలిగా సినీ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించడం తెలిసింది. కానీ తల్లి శ్రీదేవికి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు తిరిగి లేని క్రేజ్ ఉంది. అయితే జాన్వీ కపూర్ ఇప్పటివరకు ఒక్క సౌత్ ఫిలిం సినిమా కూడా చేయలేదు. ఇటీవల ఆమె ఒప్పుకున్న సినిమాలు సెట్స్ మీదకు వెళ్లాయి. అయితే జాన్వీ కపూర్ కి మాత్రం సౌత్ లో విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి. దక్షిణాదిలో ఆమె నటించిన ఒక్క సినిమా కూడా ఇప్పటికీ విడుదల కాకముందే…
Janhvi Kapoor aggression she seems to surpass her mother in that matter
తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ఉంది. దక్షిణాదిలో మొట్టమొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న “NTR 30″లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తారక్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నరు. ఒకపక్క ఈ సినిమా చేస్తూ ఉండగానే మరోపక్క… రామ్ చరణ్..బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి జాన్వీ కపూర్ తో సంప్రదింపులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మరో బిగ్ ఛాన్స్ ఈ ముద్దుగుమ్మ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Janhvi Kapoor New Gym video viral
విషయంలోకి వెళ్తే అక్కినేని అఖిల్ కొత్త సినిమా… కొత్త దర్శకుడుతో… UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో జాన్వీ కపూర్ ఫైనలైజ్ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ సినిమాతో అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. “సాహో” సినిమాకి రైటింగ్ టీంలో వర్క్ చేసిన అనిల్ కుమార్ అఖిల్ కోసం అదిరిపోయే కథని సిద్ధం చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాని త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందంట. ఆల్రెడీ అఖిల్ కి.. కథ వినిపించినట్లు అంతా ఓకే అయినట్టు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. దీంతో సినిమాల ఎంపిక విషయంలో తల్లి శ్రీదేవిని మించిపోయేలా కూతురు జాన్వీ కపూర్ మంచి దూకుడు మీద ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.