Jani Master : అందుకే జానీ మాస్టర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అయ్యాడంట.. బుట్టబొమ్మ సాంగ్ కి బెస్ట్ అవార్డు
Jani Master : స్టార్ డ్యాన్స్ డైరెక్టర్ జానీ మాస్టర్ కి సౌత్, బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో స్టార్ హీరో హీరోయిన్లతో బ్యూటిఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ వేయించి తక్కువ టైంలోనే మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీయెస్ట్ కొరియోగ్రాఫర్‌గా మారిపోయారు. ఇక అల..వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మతో ఆయన క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ లో వేసిన స్టెప్పులకు సెలబ్రెటీలు, యువత, క్రికెటర్స్ సైతం ఆడిపాడారు. దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న బీస్ట్ సినిమాలో జానీ మాస్టర్ కొరియోగ్రఫి చేసిన సాంగ్ అరబిక్ కుత్తు. ఈ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఎక్కడ చూసినా ఈ సాంగ్ ట్రెండింగ్లో ఉంది.
ఇక జానీ మాస్టర్ ఈటీవీలో వచ్చిన రియాలిటీ డాన్స్ షో ఢీ అల్టిమేట్ డాన్స్ షో డ్యాన్సర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. దీంతో ద్రోణ సినిమాకు కొరియోగ్రాఫర్ గా చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన రచ్చ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. దీంతో రామ్ చరణ్ తన అన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా కంటిన్యూ అవుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ మొదలైన హీరోల సినిమాలకు కూడా పనిచేశాడు. అలాగే ధనూష్ మారి 2 సినిమాలోని రౌడీ బేబీ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
ఇక తాజాగా జరిగిన బిహైన్డ్ వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డ్స్ లో జానీ మాస్టర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఆలా వైకుంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్ కి అవార్డు అందుకున్నారు. ఈ ఈవెంట్ కి జానీ మాస్టర్ తన ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు. తన జీవితానికి తన భార్య ఒక స్టార్ లా వచ్చిందని చెప్పారు. ఫ్యామిలీ తో కలిసి స్టేజి మీద అరబిక్ కుతూ పాటకి డాన్స్ వేశారు. అలాగే రజని కాంత్, అజిత్, విజయ్ తో కలిసి ఒక స్క్రీన్ మీద చూసి కొరియోగ్రాఫర్ చేయాలని ఉందని తెలిపాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న సినిమాకు కూడా జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారు.