Sobhan Babu : అప్పట్లో శోభన్ బాబు ఫ్యామిలీ మెన్ గా సినిమాల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే ఆంధ్ర సోగ్గాడిగా ప్రేక్షకుల మనసులో ఇప్పటికి నిలిచిపోయారు. ఆయన తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తన నటనతో తెలుగు పరిశ్రమలోనే కాకుండా తమిళ పరిశ్రమలో కూడా అభిమానులను మెప్పించగలిగాడు. ఇకపోతే అప్పట్లో శోభన్ బాబు, జయలలిత ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇందులో ఉన్న అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శోభన్ బాబు, జయలలిత కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక సినిమా ‘ డాక్టర్ బాబు ‘. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు జయలలిత తల్లి మరణించింది.
ఇక అప్పటివరకు ఆమెకు సంబంధించిన అన్ని విషయాలను ఆమె తల్లి చూసుకునేదట. తన తల్లి మరణించినాక జయలలిత శోభన్ బాబులో తన తల్లిని చూసుకుందంట. అయితే ఈ విషయాన్ని స్వయంగా శోభన్ బాబు స్క్రీన్ ప్లే సినిమా మాసపత్రికలో ‘ నేను నా కథానాయకులు ‘ అనే శీర్షికలో స్వయంగా వ్యక్తం చేశారట. ‘ డాక్టర్ బాబు ‘ సినిమా షూటింగ్ ఊటీ లో జరిగింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందంట. జయలలిత రెండు రోజులు షూటింగ్ తర్వాత శోభన్ బాబుతో అన్నమాట ఆయన తన డైరీలో ఇలా రాసుకున్నారు. ఈ డైరీలో శోభన్ బాబుతో జయలలిత ఏం చెప్పింది అంటే ‘ చెప్పలేనంత దిగులుతో నా మనసు నిండి ఉంది. బరువైన నా మనసును నీ జోకులతో తేలిక చేశారు. ప్రపంచమంతా ఇప్పుడు చాలా నిశ్చలంగా కనిపిస్తుంది. అందరితో మాట్లాడాలని, కలిసిపోవాలని, సంతోషంగా ఉండాలని నా మనసుకు అనిపిస్తుంది ‘ అంటూ జయలలిత తెలిపిందంట.
ఈ విషయాలన్నింటిని శోభన్ బాబు తన డైరీలో రాసుకొచ్చారు. అంతేకాదు ‘ నా తల్లి మరణించి ఒక సంవత్సరం కూడా కాలేదు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బాధ అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. నా అన్న వాళ్లు ఎవరూ లేరు ఉన్నవాళ్లు కూడా డబ్బు కోసమే ఆశపడి నా డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లిపోయారు. ముఖ్యంగా బంధువులని నమ్మిన వాళ్లకి బాధ్యతలు అప్పగిస్తే లక్షలు మోసం చేసి దోచుకొని వెళ్లిపోయారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఇక ఇలాంటి ఎన్నో బాధలు పడుతున్న నాకు మీరు వచ్చాక విముక్తి కలిగింది ‘ అంటూ జయలలిత తెలియజేసిందంట. జయలలిత చెప్పిన మాటలన్నీ శోభన్ బాబు తన డైరీలో రాసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే జయలలిత శోభన్ బాబులో తన తల్లిని చూసుకుందని అర్థమవుతుంది. కానీ అప్పట్లో వీరిద్దరూ సన్నిహితంగా ఉండడం వలన ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.