Jayamalini : బాలయ్య పాటకు డాన్స్ ఇరగదీసిన జయమాలిని .. ఇప్పటికి ఆ ఊపు తగ్గలేదు .. వీడియో

 Authored By prabhas | The Telugu News | Updated on :6 January 2023,7:00 pm

Jayamalini : జయమాలిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అప్పటి సినిమాలలో ఐటమ్ సాంగ్ లకు పెట్టింది పేరు జయమాలిని. తన అందచందాలతో స్టార్ హీరోలు అందరితో ఐటెం సాంగ్ చేసింది. అప్పట్లో ఆమెకు ఫుల్ క్రేజ్ ఉండేది. హీరో హీరోయిన్ లకు మించి ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే తాజాగా జయమాలిని కెమెరా ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత ఆమె కెమెరా ముందుకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జయమాలిని డాన్స్ వీడియో సోషల్ మీడియా, యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది.

ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అవుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య, సుగుణసుందరి, మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి పాటలకు ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా జనవరి 6న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే సాంగ్ బాగా వైరల్ అవుతుంది దీనికి కారణం జయమాలిని అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సాంగ్ కు జయమాలిని

Jayamalini dance video viral on instagram

Jayamalini dance video viral on instagram

అదిరిపోయే స్టెప్పులు వేసింది. తాజాగా సుమన్ టీవీ జయమాలినిని ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో యాంకర్ రోషన్ తో కలిసి జయమాలిని స్టెప్పులు వేసింది. ఇద్దరు కలిసి వీర సింహారెడ్డి సినిమాలోని మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటకు స్టెప్పులు వేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటికీ జయమాలిని డాన్స్ ఇరగదీస్తుంది అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఆ రోజుల్లో డాన్స్ ఎలా వేశారో ఇప్పుడు కూడా అంతే ఎనర్జీతో డాన్స్ వేస్తున్నారు అని అంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి