Shivatmika : జీవిత రాజశేఖర్ కూతురు కొత్త ఫోటోలు చూసి నోరెళ్ళబెడుతోన్న కుర్ర హీరోలు !
Shivatmika : ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలేసిన హీరోలలో ఒకరు రాజశేఖర్. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు రాజశేఖర్. స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రాజశేఖర్ తన తో హీరోయిన్ గా నటించిన జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. పెళ్లి అయ్యాక కూడా పలు సినిమాలు చేశారు. ఆ తర్వాత జీవిత నిర్మాతగా, దర్శకురాలిగా మారి సంచలన విజయాలను అందుకున్నారు. ఇక మనకు తెలిసిందే జీవిత రాజశేఖర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె శివాత్మిక ‘ అద్భుతం ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
ఇక రెండవ కుమార్తె శివాని రాజశేఖర్ ‘ దొరసాని ‘ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించాడు. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా శివాని రాజశేఖర్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ సినిమాలలో హీరోయిన్స్ గా నటించిన అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదు. అలాగే వీళ్లిద్దరూ అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఉంటారు. ఇక శివాత్మిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను కనులవిందు చేస్తుంది.
తాజాగా శివాత్మిక తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మొదట్లో చాలా పద్ధతిగా, సాంప్రదాయంగా కనిపించిన శివాత్మిక ఇప్పుడు గ్లామర్ ను ఆరబోస్తున్నట్లు కనిపిస్తుంది. అసలే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ నడుస్తుంది. ఈ క్రమంలో అందంతోపాటు గ్లామర్ ఎక్స్పోజింగ్ కూడా చాలా అవసరం. అందాలు చూపించే విషయంలో హద్దులు దాటాల్సి ఉంటుంది. లేకపోతే హీరోయిన్ గా సక్సెస్ కాలేరు. అందుకే శివాత్మిక తన అందాలు ఆరబోస్తూ పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ తాను కూడా అందాల ఆరబోత విషయంలో రాజీ పడడం లేదని తెలియజేస్తుంది. ఇక శివాని రాజశేఖర్ కూడా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.