Jeevitha Rajasekhar : మా ఫ్యామిలీని మీడియా టార్చ‌ర్ పెడుతుంద‌న్న జీవితా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jeevitha Rajasekhar : మా ఫ్యామిలీని మీడియా టార్చ‌ర్ పెడుతుంద‌న్న జీవితా

 Authored By sandeep | The Telugu News | Updated on :23 April 2022,9:00 pm

Jeevitha Rajasekhar : జీవితా రాజ‌శేఖ‌ర్.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆమె స్థానం ప్ర‌త్యేకం. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన జీవితా రాజ‌శేఖ‌ర్ పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంది. అయితే అడ‌పాద‌డ‌పా జీవితా వివాదాల‌లో నిలుస్తూనే ఉంటుంది. సినీ న‌టులు జీవిత, రాజశేఖర్ దంపతులు ఓ సినిమా కోసం రూ.26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై ఈ రోజు జీవిత‌ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ… తనకు సమన్లు వచ్చిన విషయం నిజమేన‌ని.. కానీ, తాను అరెస్ట్‌ కాలేదని చెప్పారు. ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ చర్చకు దారితీసింది. దీనిపై వివరణ ఇవ్వడానికి శనివారం జీవిత రాజశేఖర్ మీడియా ముందుకొచ్చారు.డా.

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శేఖర్’. మలయాళ హిట్ చిత్రం ‘జోసెఫ్’ మూవీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో జీవిత ప‌లు విష‌యాలు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినా.. నేనుంటే నేను హెడ్ లైన్ అవుతా.. మొన్న మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేశారు. నేను ప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ చేశా.. నేనే కాదు చాలామంది ఆయనకి సపోర్ట్ చేశారు.. కానీ నేనే హెడ్ లైన్ అయ్యాను.నేను కానీ రాజశేఖర్ గారు కానీ ఎవరికీ అన్యాయం చేయలేదు.నాకూ ఇద్దరూ కూతుళ్లు ఉన్నారు. మేం ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతాం.. నేను కాస్తైనా కంట్రోల్ చేసుకుంటున్నా కానీ..

jeevitha rajasekhar reacts on thumb nails

jeevitha rajasekhar reacts on thumb nails

మా ఆయన అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడేస్తారు.దేవుడు దయ వల్ల నేను మా ఆయన నా పిల్లలు అంతా బాగున్నాం.. మా గురించి ఏది జరిగినా రకరకాలుగా తంబ్ నెయిల్స్ పెడుతున్నారు. చాలామంది చదువుకోలేని వాళ్లని వీటి గురించి తెలియదు. చాలామంది నాకు ఫోన్లు చేసి మీ అమ్మాయిలు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. మా అమ్మాయిల గురించి తప్పుడు తంబ్ నెయిల్స్ పెట్టి వార్తలు రాశారు. ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది. విషయం తెలియకుండా వార్తలు రాయడం వల్ల వాళ్ల కెరియర్ ఏమౌతుందో గుర్తించండి.. రేపటి రోజున మా పిల్లలు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్తారు. వాళ్ల పరిస్థితి ఏం కావాలి.. చాలా హర్టింగ్‌గా ఉంది అని జీవిత బాధ‌ప‌డింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది