Jeevitha Rajasekhar : పెళ్లికి ముందే రాజశేఖర్‌తో ఒకే రూమ్‌లో గడిపానంటూ జీవిత సంచలన వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar : టాలీవుడ్‌లో ఉండే మోస్ట్ క్రేజీయెస్ట్ జంటలలో రాజశేఖర్, జీవిత జంట కూడా ఒకటి. వీరిద్దరు బయట కూడా చాలా ఆప్యాయంగా, ప్రేమగా కనిపిస్తూ ఉంటారు. వీరి వైవాహిక జీవితంలో శివాని, శివాత్మికలు జన్మించగా వారిని మంచి హీరోయిన్స్‌గా చేయాలని తపన పడుతున్నారు. అయితే జీవిత రాజశేఖర్ ప్రేమాయణంకి సంబంధించి నెట్టింట ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూ ఉండేవి. తాజాగా జీవిత తమ ప్రేయాయణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్ళికి ముందు నుంచే […]
Jeevitha Rajasekhar : టాలీవుడ్‌లో ఉండే మోస్ట్ క్రేజీయెస్ట్ జంటలలో రాజశేఖర్, జీవిత జంట కూడా ఒకటి. వీరిద్దరు బయట కూడా చాలా ఆప్యాయంగా, ప్రేమగా కనిపిస్తూ ఉంటారు. వీరి వైవాహిక జీవితంలో శివాని, శివాత్మికలు జన్మించగా వారిని మంచి హీరోయిన్స్‌గా చేయాలని తపన పడుతున్నారు. అయితే జీవిత రాజశేఖర్ ప్రేమాయణంకి సంబంధించి నెట్టింట ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూ ఉండేవి. తాజాగా జీవిత తమ ప్రేయాయణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్ళికి ముందు నుంచే ఆయనతో తానూ ఎమోషనల్ గా అటాచ్ అయి ఉన్నట్లు తెలిపింది. రాజశేఖర్ కి నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు.
జీవిత అలా ఓపెన్ అయిందేంటి..
రాజశేఖర్ గారికి అభిమానులు, బయట పనులు, సినిమాలు ఎన్ని ఉన్నా నాతో చెప్పకుండా ఏమి చేయరు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఆయన్ని పిలిస్తే ఆ విషయం కూడా నాతో చెబుతారు. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అని జీవిత నవ్వుతూ అన్నారు. ఇక పెళ్లి పెద్దలని ఒప్పించే చేసుకోవాలని అనుకున్నాను. నేను బోల్డ్ గా చెప్పేస్తున్నా. పెళ్ళికి ముందే నేను రాజశేఖర్ గారితో ఒకే రూమ్ లో గడిపా. ఇద్దరం కలసి జీవించాం. మా ఇద్దరి క్లోజ్ రిలేషన్ వల్ల ఇండస్ట్రీలో మా గురించి పెద్ద హాట్ టాపిక్ అయింది. రాజశేఖర్ గారితో బోల్డ్ గా జీవించినప్పటికీ.. ఒక వేళ పెళ్లి కాకుంటే నా పరిస్థితి ఏంటి అని నేను భయపడలేదు. ఇక ఇండస్ట్రీకి చెందిన ఒక అమ్మాయితో రాజశేఖర్ గారికి పెళ్లి ఫిక్స్ అయింది. రాజశేఖర్ గారు ఆ అమ్మాయిని తీసుకువచ్చారు. ఇద్దరికీ రాజశేఖర్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది. కానీ ఆ అమ్మాయి నా గురించి వాళ్ళ పేరెంట్స్ తో చర్చించిందట.
వాళ్ళ పేరెంట్స్ రాజశేఖర్ గారికి కండిషన్ పెట్టారు. ఈ పెళ్లి జరగాలంటే నువ్వు జీవితని వదిలేయాలి అని అన్నారు. ఆమెతో మాట్లాడకూడదు అని చెప్పారట. రాజశేఖర్ అప్పుడు మాట్లాడకుండా ఉండడం మాత్రం కుదరదు అని చెప్పేశారు. దీనితో వాళ్ళు చర్చించుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్ లో రాజశేఖర్ గారికి నేనే సేవలు చేశా. హాస్పిటల్ నుంచి మా ఇంటికి కూడా వెళ్ళలేదు. రాజశేఖర్ గారి ఇంటికే వెళ్ళా. ఆయన పూర్తిగా కోలుకునే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఆ తర్వాత మేం డిసైడ్ అయి పెళ్లి చేసుకున్నట్లు జీవిత తెలిపారు. అలా జీవిత, రాజశేఖర్‌ల వివాహం జరిగింది.