Janaki Kalaganaledu : థర్డ్ రౌండ్ లో రామా గెలుస్తాడా? తన పాయసం అందరూ తాగుతారా? జ్ఞానాంబ ఏం చేస్తుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu : థర్డ్ రౌండ్ లో రామా గెలుస్తాడా? తన పాయసం అందరూ తాగుతారా? జ్ఞానాంబ ఏం చేస్తుంది?

 Authored By gatla | The Telugu News | Updated on :12 June 2022,11:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు 13 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 321 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబ, గోవిందరాజును చూసి రామా షాక్ అవుతాడు. ఓవైపు ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉంది. మరోవైపు కంగారుగా కూడా ఉంది అంటాడు. నువ్వు వచ్చావు కదా. గుండెల నిండా చాలా ధైర్యం వచ్చేసింది. నువ్వు సరిగ్గా సమయానికి వచ్చావు. పోటీల్లో ఇష్టమైన వంట చేయమన్నారు. ఏ వంట చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏ వంట చేయాలో చెప్పు అని అడుగుతాడు రామా. సిరి ధాన్యాలతో నువ్వు వంట చేయి అని సలహా ఇస్తుంది జ్ఞానాంబ. అవి పాతకాలపు జీవితాల్లో ఒక భాగం కాబట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నువ్వు సిరిధాన్యాలతో ఎలాగూ వంట బాగా చేస్తావు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తావు అని చెబుతుంది జ్ఞానాంబ.

jnanamba sudden appearance at compitition shocked by ramachandra

jnanamba sudden appearance at compitition shocked by ramachandra

దీంతో సరే అంటాడు. ఇంతలో పోటీలు ప్రారంభం అవుతాయి. వెళ్లి జ్ఞానాంబ చెప్పిన వంటను చేయడం ప్రారంభిస్తాడు. అందరూ వంట చేయడం పూర్తయ్యాక.. ఆ వంటలను టూరిస్టులకు అమ్మాలి. ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తాయో.. ఎవరి వంటకాలు అయితే ఎక్కువగా అమ్ముడుపోతాయో వాళ్లే ఈ రౌండ్ లో గెలిచినట్టు.. అంటుంది యాంకర్. దీంతో ఒక్కొక్కరుగా టూరిస్టులు అందరి స్టాల్స్ వద్దకు వస్తుంటారు. ఎవ్వరూ రామా స్టాల్ దగ్గరికి వెళ్లరు. అందరూ వేరే స్టాల్ వద్దకు వెళ్లి కొంటారు. దీంతో జ్ఞానాంబకు కంగారు వస్తుంది.

Janaki Kalaganaledu : ఉచితంగా ఇచ్చేయమని సలహా ఇచ్చిన జానకి

ఎవ్వరూ కొనకపోవడంతో ఏం చేయాలి అని రామా.. జానకిని అడుగుతాడు. దీంతో ఉచితంగా ఇవ్వండి అని చెబుతుంది. ఉచితం అని చెప్పినా కూడా ఎవ్వరూ వచ్చి రామచంద్ర దగ్గర పాయసం కొనరు. దీంతో ఏం చేయాలో రామాకు అర్థం కాదు.

చివరకు ఒక పిల్లాడు వచ్చి దాన్ని తాగుతాడు. కానీ.. వాళ్ల అమ్మ వద్దు అంటుంది. దీంతో పిల్లాడు అదే కావాలి అంటాడు. అది పిల్లలకు చాలా బలం అని చెబుతాడు రామా. దీంతో అందులో ఏం వేశారు చెప్పండి అని అడుగుతుంది ఆ మహిళ.

దీంతో దాన్ని బెల్లం, పాలు, మొక్కజొన్న, సిరిధాన్యాలతో తయారు చేశాను అని చెబుతాడు రామా. దీంతో దాన్ని ఒకసారి రుచి చూస్తాను అంటుంది. దాన్ని టేస్ట్ చేస్తుంది. బాగుండటంతో ఏమండి మీరు కూడా తాగి చూడండి.. చాలా బాగుంది అని అంటుంది. దీంతో అతడు కూడా తాగి బాగుంది అని అంటాడు.

డబ్బులు 500 ఇచ్చి తీసుకో అంటాడు. వద్దు.. దానికి 100 రూపాయలు ఇవ్వండి చాలు అంటాడు రామా. కానీ.. ఏంకాదు 500 తీసుకోండి అంటాడు అతడు. దీంతో రామా ఆ 500 నోటును తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది