Home » Entertainment » Jr Ntr 30 Story Leaked
Entertainment

JR NTR 30 : లీక్ అయిన ఎన్‌టి‌ఆర్ 30 స్టోరీ.. పిచ్చ కోపంతో ఊగిపోతోన్న ఎన్‌టి‌ఆర్ .. కొర‌టాల శివ దే తప్పు ?

Authored By
Sam C
The Telugu News | Published on: October 18, 2022, 6:30 pm
Advertisement

JR NTR 30 : ఆర్ఆర్ఆర్ వంటి భారీ హిట్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. కొర‌టాల‌తో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఎప్పుడో వ‌చ్చిన ఇంత వ‌ర‌కు సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. ఓ వైపు ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభ‌మవుతుంద‌నే దానిపై మేక‌ర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే RRR త‌ర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా చేయాల‌నే ఆలోచ‌న ఉండ‌టం వ‌ల్ల ఎన్టీఆర్ 30 పై చాలా కేర్‌తో ముందుకు సాగుతున్నారు. కొర‌టాల శివ ఆల్‌రెడీ త‌యారు చేసుకున్న స్క్రిప్ట్‌ను రీ రైట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే ఈ సినిమా ఇంత లేట్ అవుతుంద‌ని అంటున్నారు.

Advertisement

ఇక ఈసారి గరుడ పురాణంలోని ఓ అంశాన్ని తీసుకొని కథను రెడీ చేశారట. అయితే గరుడ పురాణంలో 18 వేల శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన పాయింట్ ఆధారంగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని కొరటాల నమ్మకం. అందుకు ఈ సారి సరికొత్త పాయింట్ ను ఎంచుకున్నాడట. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించిన అప‌రిచితుడు. ఈ సినిమాలోనూ హీరో మ‌నుషులు చేసే త‌ప్పుల‌కు గ‌రుడ పురాణం ఆధారంగానే శిక్ష‌ల‌ను విధిస్తుంటాడు. మరి ఇప్పుడు కొర‌టాల కూడా అదే స్టైల్‌ను ఫాలో కానున్నాడ‌ని వినిపిస్తోన్న వార్త‌ల్లో నిజా నిజాలు తెలియాలంటే వెయిటింగ్ త‌ప్పదు. అయితే కొరటాల స్టోరీని రివీల్ చేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఆయ‌న‌పై గుర్రుగా ఉన్నార‌ట‌.

JR NTR 30 story leaked

Advertisement

JR NTR 30 : ఆయ‌న‌దే త‌ప్పు..!

ఇక ఇండియాలోనే కాకుండా వెస్ట్రన్ కంట్రీల్లోనూ ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమాను జపాన్, తదితర 9 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఇదివరకు ఎన్టీఆర్ -కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బంపర్ హిట్టు కొట్టింది.ఇప్పుడు ఈ సినిమా కూడా త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని భావిస్తున్నారు. ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి హైప్ సెట్టయ్యింది. అయితే ఎన్టీఆర్ 30 కి గాను మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ని మేకర్స్ అభిమానుల డిమాండ్ తో తీసుకొచ్చారు. దీనితో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా రీసెంట్‌గా అనిరుద్ పుట్టినరోజు కావడంతో సినిమా నిర్మాతలు అతడికి శుభాకాంక్షలు తెలియజేసి ఎన్టీఆర్ 30 ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి