Jr NTR : జీవితం లోనే అతిపెద్ద నిర్ణయం.. ఈ న్యూస్ చదివితే జూనియర్ ఎన్టీఆర్ దేవుడు రా అంటారు..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Jr NTR : జీవితం లోనే అతిపెద్ద నిర్ణయం.. ఈ న్యూస్ చదివితే జూనియర్ ఎన్టీఆర్ దేవుడు రా అంటారు..!!

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సత్తా ఏంటో తెలిసేలా చేశారు దర్శక ధీరుడు జక్కన్న. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ అద్భుతమైన నటనతో సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. ఇటీవల ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. అలాగే ఈ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :1 February 2023,7:00 pm

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సత్తా ఏంటో తెలిసేలా చేశారు దర్శక ధీరుడు జక్కన్న. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ అద్భుతమైన నటనతో సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. ఇటీవల ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందని జనాలు నమ్ముతున్నారు.

Jr NTR big decision about next film

Jr NTR big decision about next film

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఓకే చేశాడన్న సంగతి మనకు తెలిసిందే. అప్పుడెప్పుడో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేసిన కొరటాల ఆ తర్వాత సినిమా గురించి పట్టించుకోవడమే మానేశాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాలపై పరోక్షంగా కౌంటర్స్ వేశారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి కొత్త అప్డేట్ కొరటాల ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని, ఏప్రిల్ 5న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతుదని చెప్పారు.

Jr NTR big decision about next film

Jr NTR big decision about next film

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఫిబ్రవరి 4న ఈ సినిమాను గ్రాండ్ గా ప్రారంభించాలని రెడీ అయ్యారట. కానీ తారకరత్న హెల్త్ కండిషన్ బాగోలేకపోవడంతో షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 21వ తేదీ పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ లు నటిస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది