Taraka Ratna : తారకరత్న చికిత్సకు ఖర్చు ఎవరు పెడుతున్నారో తెలుసా..!!

Advertisement

Taraka Ratna : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కొద్ది దూరం నడిచిన తర్వాత గుండె పోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు తారకరత్నను స్థానిక కుప్పం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఆయనకు అత్యవసర చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ కు తరలించడం జరిగింది. అత్యంత ఖరీదైన వైద్యమును నారాయణ హృదయాలయ వారు తారకరత్నకు అందిస్తున్నట్లుగా నందమూరి మరియు నారా కుటుంబ సభ్యుల నుండి సమాచారం అందుతుంది.

do you know Who Pays Taraka Ratna Hospital Bills
do you know Who Pays Taraka Ratna Hospital Bills

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు దేశం పార్టీ వారు తారకరత్న యొక్క చికిత్సకు పూర్తి ఖర్చులు భరిస్తున్నట్లుగా తెలుస్తోంది. నారా లోకేష్ యొక్క పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండె పోటుకు గురయ్యాడు. కనుక పూర్తి ఖర్చును తానే భరిస్తాను అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారంట. ఈ విషయాన్ని తారకరత్న భార్యతో చంద్రబాబు నాయుడు తెలియజేసినట్లు తెలుస్తోంది. తారకరత్న ఇతర నందమూరి ఫ్యామిలీతో పోలిస్తే ఆర్థికంగా కాస్త వెనుకబడి ఉంటాడట. అందుకు గాను చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
do you know Who Pays Taraka Ratna Hospital Bills
do you know Who Pays Taraka Ratna Hospital Bills

మరి కొందరు మాత్రం చంద్రబాబు నాయుడు మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా తారకరత్న యొక్క హాస్పిటల్ బిల్లులను చెల్లించేందుకు ముందుకు రావడం అభినందనీయం. తారకరత్న యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త పరవాలేదు అన్నట్లుగా వైద్యులు ప్రకటించారు. దాంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లి నారాయణ హృదయాలయాల్లో ఉన్న తారకరత్నను పరామర్శించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement