Home » Entertainment » Jr Ntr Devara Movie Tough Competition
Entertainment

JR Ntr : జూనియర్ ఎన్టీఆర్ కి పోటీ గా ఎంతమంది వచ్చారో చూడండి .. వామ్మో !

Authored By
aruna
The Telugu News | Published on: June 27, 2023, 5:00 pm
Advertisement

JR Ntr : ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ దేవర ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించి చాలా రోజులవుతున్నా కొన్ని కారణాల వలన షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అలాగే జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్, ప్రతి నాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. విజువల్ వండర్స్ గా ఈ సినిమాని యాక్షన్ ఎలివేషన్స్ లో చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 15న విడుదల చేయాలని కొరటాల ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ టైం లోనే రెండు హిందీ సినిమాలు విడుదల కానున్నాయి. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రఫ్ కాంబినేషన్లో రాబోతున్న ‘ బడే మియాన్ చోటే మియన్ ‘ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కూడా ఏప్రిల్ లో విడుదల కాబోతుంది.

JR Ntr Devara movie tough competition

Advertisement

అలాగే కేరళ స్టోరీ మేకర్స్ నుంచి ‘ బస్తర్ ‘ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ రెండు సినిమాలు కూడా దేవరకు పోటీగానే విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు దేవర పై ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల దేవర సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో కొరటాలకి అంతగా గుర్తింపు లేదు. అయిన ఎన్టీఆర్ ఇమేజ్ పైన ఈ సినిమా అంతా ఆధారపడి ఉంది. ఇక జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు కాబట్టి హిందీ మార్కెట్ లో కలిసొచ్చే అవకాశం ఉంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి