Jr NTR Devara Record : ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రికార్డ్.. మొత్తం 46 షోస్ తో నెవర్ బిఫోర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr NTR Devara Record : ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రికార్డ్.. మొత్తం 46 షోస్ తో నెవర్ బిఫోర్..!

Jr NTR Devara Record : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డుల రచ్చ మొదలు పెట్టింది. ఇప్పటికే యూఎస్ లో ప్రీ బుకింగ్స్ తోనే 2 మిలియన్స్ రికార్డ్ బ్రేక్ చేసిన దేవర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా నెక్స్ట్ లెవెల్ రేంజ్ లో బుకింగ్స్ సాధించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఏడు థియేటర్ లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 September 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Jr NTR Devara Record : ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రికార్డ్.. మొత్తం 46 షోస్ తో నెవర్ బిఫోర్..!

Jr NTR Devara Record : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డుల రచ్చ మొదలు పెట్టింది. ఇప్పటికే యూఎస్ లో ప్రీ బుకింగ్స్ తోనే 2 మిలియన్స్ రికార్డ్ బ్రేక్ చేసిన దేవర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా నెక్స్ట్ లెవెల్ రేంజ్ లో బుకింగ్స్ సాధించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఏడు థియేటర్ లో మొత్తం 46 షోలు మొదటి రోజు వేయనున్నారు. వాటికి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దేవర మొదటిరోజు కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచే 1.25 కోట్లు రాబడుతుంది. ఇది నెవర్ బిఫోర్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు కల్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 87 లక్షలు రాబట్టగా.. మహేష్ గుంటూరు కారం 82 లక్షలు, ఆర్.ఆర్.ఆర్ 76 లక్షలు రాబట్టింది. దేవర సినిమా వీటన్నిటినీ బ్రేక్ చేస్తూ ఏకంగా 1 కోటి పాతి లక్షల అడ్వాన్స్ సేల్స్ రాబట్టింది.

Jr NTR Devara Record దేవర రికార్డులకు సాక్ష్యంగా..

దేవర అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం అక్కడ మాత్రమే కాఉ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా జరుగుతుంది. ఎక్కడికి అక్కడ ఇలా టికెట్స్ పెట్టడమే ఆలస్యం అలా ఫిల్ అయిపోతున్నాయి. బీ,సీ సెంటర్స్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఒక రేంజ్ చూపిస్తున్నాయి. కచ్చితంగా మొదటి రోజు దేవర ఊహలకు కూడా అందని విధంగా రికార్డ్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దేవర రికార్డులకు ఫ్యాన్స్ అంతా సాక్ష్యం అయ్యేలా ఉంది.

Jr NTR Devara Record ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రికార్డ్ మొత్తం 46 షోస్ తో నెవర్ బిఫోర్

Jr NTR Devara Record : ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రికార్డ్.. మొత్తం 46 షోస్ తో నెవర్ బిఫోర్..!

దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేశాడు. అనిరుద్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యేలా ఉంది. సెప్టెంబర్ 27న ఎన్ టీ ఆర్ దేవర ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది