JR NTR Devara : దేవర కోసం యానిమల్ విలన్.. తారక్ కోసం కొరటాల శివ ఫ్యూజులు ఎగిరిపోయే ట్రీట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

JR NTR Devara : దేవర కోసం యానిమల్ విలన్.. తారక్ కోసం కొరటాల శివ ఫ్యూజులు ఎగిరిపోయే ట్రీట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  JR NTR Devara : దేవర కోసం యానిమల్ విలన్.. తారక్ కోసం కొరటాల శివ ఫ్యూజులు ఎగిరిపోయే ట్రీట్..!

JR NTR Devara : యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించబోతున్నారు. దేవరలో ఎన్టీఆర్ కి జతగా జాన్వి కపూర్ నటిస్తుంది. ముందు ఒక ప్రాజెక్ట్ గా తీయాలని అనుకున్న ఈ సినిమాను ఆ తర్వాత రెండు ప్రాజెక్టులుగా ఫిక్స్ చేశారు. దేవర 1 సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఇప్పటికే సినిమాలో బాలీవుడ్ స్టార్ విలన్ దేవర కోసం పనిచేస్తున్నాడు. దేవర కోసం సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. ఐతే ఇప్పుడు అతను చాలదు అన్నట్టుగా మరో విలన్ ని తీసుకొస్తున్నారని తెలుస్తుంది. యానిమల్ సినిమాలో విలన్ గా అదరగొట్టిన బాబీ డియోల్ ని కూడా దేవర కోసం రంగంలోకి దించుతున్నరట కొరటాల శివ. దేవర పార్ట్ 1 లో సైఫ్ సెకండ్ పార్ట్ లో బాబీ డియోల్ ఉంటారని తెలుస్తుంది.

JR NTR Devara యాక్షన్ సీన్స్ వేరే లెవెల్..

ఎన్టీఆర్ దేవర సినిమా డిఫరెంట్ కథాంశంతో వస్తుంది. కొరటాల శివ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా అవ్వడంతో దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో తారక్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు.

JR NTR Devara దేవర కోసం యానిమల్ విలన్ తారక్ కోసం కొరటాల శివ ఫ్యూజులు ఎగిరిపోయే ట్రీట్

JR NTR Devara : దేవర కోసం యానిమల్ విలన్.. తారక్ కోసం కొరటాల శివ ఫ్యూజులు ఎగిరిపోయే ట్రీట్..!

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కలిసి చేస్తున్న దేవర సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ మార్క్ మరోసారి చూపించేలా బాక్సాఫీస్ యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు. మరి దేవర ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది