Categories: EntertainmentNews

Jr Ntr : నిజంగా దేవ‌రే..తెలుగు రాష్ట్రాల‌కి జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం..!

Jr Ntr : ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు మ‌న హీరోలు మాన‌వ‌త్వం చాటుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.ఇటీవ‌ల కేర‌ళ‌లో భారీ వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు తెలుగు హీరోలు ఎవరికి తోచినంత వారు సాయం చేశారు. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్ర‌ల‌లో కూడా వ‌ర‌ద విజృంభించ‌డంతో హీరోలు ముందుకు వ‌స్తున్నారు. వరదబారిన ప్రజలు ఆకలిదప్పులతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలివస్తున్నారు. వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ తనవంతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రకటించారు.

Jr Ntr భారీ విరాళం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. వరద విపత్తు నుండి ఉపశమనం పొందడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే సహాయక, పునరావాస చర్యలకు తనవంతుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయ‌ల మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తున్నానని అన్నారు. వరద బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన తొలి హీరో ఎన్టీఆర్.

Jr Ntr : నిజంగా దేవ‌రే..తెలుగు రాష్ట్రాల‌కి జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం..!

దీంతో ఆయన్ను అభిమానులు, నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. తారక్ బాటలో మరికొందరు యువ హీరోలు పయనిస్తున్నారు. ఎన్టీఆర్‌ను బాగా లైక్ చేసే విశ్వక్‌సేన్ సైతం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 5 లక్షలు విరాళం ప్రకటించారు. కాగా, ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. కొరటాల శివ దర్శకుడు. యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

3 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

4 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

5 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

6 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

8 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

9 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

9 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

10 hours ago