Jr Ntr : నిజంగా దేవరే..తెలుగు రాష్ట్రాలకి జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం..!
ప్రధానాంశాలు:
Jr Ntr : నిజంగా దేవరే..తెలుగు రాష్ట్రాలకి జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం..!
Jr Ntr : ఆపదలో ఉన్నప్పుడు మన హీరోలు మానవత్వం చాటుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.ఇటీవల కేరళలో భారీ వరదలు వచ్చినప్పుడు తెలుగు హీరోలు ఎవరికి తోచినంత వారు సాయం చేశారు. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో కూడా వరద విజృంభించడంతో హీరోలు ముందుకు వస్తున్నారు. వరదబారిన ప్రజలు ఆకలిదప్పులతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదిలివస్తున్నారు. వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తనవంతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు.
Jr Ntr భారీ విరాళం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. వరద విపత్తు నుండి ఉపశమనం పొందడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే సహాయక, పునరావాస చర్యలకు తనవంతుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తున్నానని అన్నారు. వరద బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన తొలి హీరో ఎన్టీఆర్.
దీంతో ఆయన్ను అభిమానులు, నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. తారక్ బాటలో మరికొందరు యువ హీరోలు పయనిస్తున్నారు. ఎన్టీఆర్‌ను బాగా లైక్ చేసే విశ్వక్‌సేన్ సైతం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 5 లక్షలు విరాళం ప్రకటించారు. కాగా, ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. కొరటాల శివ దర్శకుడు. యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి.