Jr Ntr : దూరం నుండి వచ్చిన మూగ అభిమాని.. ఎన్టీఆర్ పిలిచి ఏం చేశాడంటే..!
ప్రధానాంశాలు:
Jr Ntr : దూరం నుండి వచ్చిన మూగ అభిమాని..ఎన్టీఆర్ పిలిచి ఏం చేశాడంటే..!
Jr Ntr : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ప్రేక్షకులలో ఏ స్థాయి అభిమానం ఉందనేది చెప్పడానికి వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉదాహరణ. ఆయన్ను కోట్లాది మంది అభిమానిస్తున్నారు. అందులో గుడివాడకు చెందిన ఓ యువకుడు ఉన్నారు. అతనికి మాటలు రావు. అయినా సరే తన అభిమాన కథానాయకుడిని దగ్గర నుంచి చూడాలని ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు. కేవలం తన సైగలతోనే తాను ఎన్టీఆర్ కి వీరాభిమాని అని, గుడివాడ నుంచి ఎన్టీఆర్ ని చూడటానికి వచ్చానని తెలిపాడు.

Jr Ntr : దూరం నుండి వచ్చిన మూగ అభిమాని.. ఎన్టీఆర్ పిలిచి ఏం చేశాడంటే..!
Jr Ntr : ఇది కదా ఎన్టీఆర్ అంటే..
దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ఈవెంట్ మేనేజ్మెంట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు వెళ్లడంతో ఆ అభిమానిని ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లి కలిపించారు. ఎన్టీఆర్, హృతిక్ ఆ అభిమానిని పలకరించి ఫొటోలు ఇచ్చారు. అభిమానుల పట్ల ఎన్టీఆర్ ఎంత బాధ్యతగా, జాగ్రత్తగా వ్యవహరిస్తారనేది చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ. కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ అడుగుపెట్టి పాతికేళ్ళు.
ఇప్పుడు ఆయన ‘వార్ 2’తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల కోసం మరో పాతికేళ్ళు కష్టపడతానని తెలిపారు. ”పాతికేళ్ల క్రితం ‘నిన్ను చూడాలని’ సినిమా మొదలైనప్పుడు అమ్మా నాన్న తప్ప నా పక్కన ఎవరూ లేరు. మొదటి సినిమా విడుదల కాకముందు ముజీబ్ అని ఓ వ్యక్తి వచ్చారు. ‘నేను మీ అభిమాని’ అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఉన్నాడు. తర్వాత నుంచి ఒక్కొక్కరుగా వచ్చారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా కష్టాలు, సంతోషాల్లో తోడుగా అభిమానులు ఉన్నారు అని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.