Jr NTR : ఎన్టీఆర్ కి వంద కోట్ల నష్టం.. దీన్ని భర్తీ చేసేది ఎవరు?
Jr NTR : స్టార్ హీరోలకు సక్సెస్ పడిందంటే రెమ్యూనరేషన్ భారీగా పెరుగుతుంది. ఎన్టీఆర్ కి ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయం నమోదు అయిన విషయం తెలిసిందే. దాంతో ఆయన తదుపరి సినిమా కు ఏకంగా 70 నుండి 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే మార్కెట్ పెరిగింది అనడంలో సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా విడుదలైన వెంటనే ఎన్టీఆర్ తన తదుపరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే కచ్చితంగా ఆయన మార్కెట్ మరింతగా విస్తరించేది.. అలాగే రాజమౌళి సినిమా వల్ల వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకున్నట్లు అయ్యేది అంటూ టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టలేదు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఆయన సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాకుంటే 2023 సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం దాదాపుగా లేనట్లే… అంటే ఎన్టీఆర్ సినిమా కోసం 2024 వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొందరు ఫైనాన్సియల్ గా మాట్లాడుతూ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒక్కొక్క సినిమాకు తీసుకునే పారితోషికం భారీ మొత్తంలో ఉంటుంది..
కనుక గత ఐదు ఆరు నెలలుగా ఆయన ఖాళీగా ఉండటం వల్ల భారీ పారితోషికం ఆయన మిస్ అవుతున్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఆయన ఒకవేళ ఇప్పటికే సినిమా చేసుకుంటే 50 నుండి 60 కోట్ల రూపాయలు ఆయన ఖాతాలో పడేవి. వెంటనే మరో సినిమాను కూడా చేసేవాడు, అలా రెండు సినిమాలతో ఆయన రూ. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ దక్కించుకునే వాడు. కనుక కొరటాల శివ స్క్రిప్ట్ విషయం లో ఆలస్యం చేయడం వల్ల ఎన్టీఆర్ కి 100 కోట్ల నష్టం అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నష్టం ను భర్తీ చేసేది ఎవరు? అంటూ ఎన్టీఆర్ అభిమానులు దర్శకుడు కొరటాల శివ ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.