Jr NTR Making Fights IN Cine Industry With Politics
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన జూనియర్ చిత్రంలో కొమరం భీముడు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించి, మెప్పించి తిరుగులేని స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు తన 30వ సినిమాకి సంబంధించిన పనులలో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో ఎన్టీఆర్ తో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కలిసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఎన్టీఆర్, అమిత్ షాల మీటింగ్ పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి.
అయితే అమిత్ షా ఎన్టీఆర్ ను కలిసిన విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన కోపం ఉందట. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా హీరో నితిన్ కూడా తాజాగా బీజేపీ నాయకుడిని కలిశారని తెలిసింది. వారిద్దరూ రాజకీయంగా ఏమీ మాట్లాడలేదు అయినా ఆయన కూడా అమిత్ షా ను కలవడంతో కేసీఆర్ టాలీవుడ్ మీద కోపం పెంచుకున్నాడు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోపం కారణంగానే ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఖరి నిమిషంలో క్యాన్సల్ చేయించారు అని కొందరు చెబుతున్నారు. రానున్న రోజులలో ఈ పరిణామలతో ఎన్టీఆర్ సినిమాలకు దెబ్బ వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
Jr NTR Making Fights IN Cine Industry With Politics
జూనియర్ ఎన్టీఆర్ సేవలను తెలంగాణలో – ఏపీలో ఎక్కడ వినియోగించుకుంటారని సోము వీర్రాజుని ప్రశ్నించగా.. ఆయనకు ప్రజాదరణ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే వాడుకుంటామని తేల్చి చెప్పారు. పరోక్షంగా ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుంటామంటూ సోము స్పష్టం చేసారు. ఇదే సమయంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుతో తమ వైఖరిలో మార్పు లేదన్నారు. కుటుంబ పార్టీలకు తమ పార్టీ దూరంగానే ఉంటుందని వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఈ విషయం స్పష్టం చేసిందన్నారు. ఇక..జనసేనతో తమ పొత్తు ఉంటుందని చెబుతూనే..పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేయటం ఇప్పుడు రాజకీయంగా సంచలనానికి కారణమవుతోంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.