Jr NTR : జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ల‌న ఇండ‌స్ట్రీలో అన్ని గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr NTR : జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ల‌న ఇండ‌స్ట్రీలో అన్ని గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయా?

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగా, మ‌ల్టీ టాలెంటెడ్ పర్స‌న్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన జూనియర్ చిత్రంలో కొమరం భీముడు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించి, మెప్పించి తిరుగులేని స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు త‌న 30వ సినిమాకి సంబంధించిన ప‌నుల‌లో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో ఎన్టీఆర్ తో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :8 September 2022,6:00 pm

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగా, మ‌ల్టీ టాలెంటెడ్ పర్స‌న్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన జూనియర్ చిత్రంలో కొమరం భీముడు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించి, మెప్పించి తిరుగులేని స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు త‌న 30వ సినిమాకి సంబంధించిన ప‌నుల‌లో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో ఎన్టీఆర్ తో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కలిసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఎన్టీఆర్, అమిత్ షాల మీటింగ్ పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి.

Jr NTR : ఎన్టీఆర్‌పై ఫైర్..

అయితే అమిత్ షా ఎన్టీఆర్ ను కలిసిన విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన కోపం ఉందట. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా హీరో నితిన్ కూడా తాజాగా బీజేపీ నాయకుడిని కలిశారని తెలిసింది. వారిద్దరూ రాజకీయంగా ఏమీ మాట్లాడలేదు అయినా ఆయన కూడా అమిత్ షా ను కలవడంతో కేసీఆర్ టాలీవుడ్ మీద కోపం పెంచుకున్నాడు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోపం కారణంగానే ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఖరి నిమిషంలో క్యాన్సల్ చేయించారు అని కొందరు చెబుతున్నారు. రానున్న రోజుల‌లో ఈ ప‌రిణామ‌ల‌తో ఎన్టీఆర్ సినిమాల‌కు దెబ్బ వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Jr NTR Making Fights IN Cine Industry With Politics

Jr NTR Making Fights IN Cine Industry With Politics

జూనియర్ ఎన్టీఆర్ సేవలను తెలంగాణలో – ఏపీలో ఎక్కడ వినియోగించుకుంటారని సోము వీర్రాజుని ప్రశ్నించగా.. ఆయనకు ప్రజాదరణ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే వాడుకుంటామని తేల్చి చెప్పారు. పరోక్షంగా ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుంటామంటూ సోము స్పష్టం చేసారు. ఇదే సమయంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుతో తమ వైఖరిలో మార్పు లేదన్నారు. కుటుంబ పార్టీలకు తమ పార్టీ దూరంగానే ఉంటుందని వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఈ విషయం స్పష్టం చేసిందన్నారు. ఇక..జనసేనతో తమ పొత్తు ఉంటుందని చెబుతూనే..పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేయటం ఇప్పుడు రాజకీయంగా సంచలనానికి కారణమవుతోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది