Jr NTR : తార‌క‌ర‌త్న క్రిటిక‌ల్ కండీష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డలేదు.. పోరాడుతూనే ఉన్నారు : జూనియ‌ర్ ఎన్టీఆర్

Authored By aruna | The Telugu News | Published on: January 29, 2023, 1:20 pm

Jr NTR : నంద‌మూరి హీరో తార‌క‌ర‌త్న గుండెపోటుతో బెంగళూరులోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. ఆయన హెల్త్ చాలా సీరియస్ గా ఉందని తెలియడంతో సినీ, రాజకీయ వర్గాలతో పాటు నందమూరి ఫ్యామిలీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా తారకరత్నను చూసేందుకు వస్తున్న నేప‌థ్యంలో ఈ రోజు ఉద‌యం జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ త‌మ ఫ్యామిలీతో క‌లిసి బెంగ‌ళూరుకి వెళ్లారు.తార‌కర‌త్న క్రిటిక‌ల్ కండీష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డ్డార‌ని చెప్ప‌లేం. విష‌మంగా ఉన్న‌ప్ప‌టికీ వైద్యానికి స్పందిస్తూనే ఉన్నారు.మెరుగైన వైద్యం అందుతుంది.

JR ntr open up on tarakaratna Health condition

JR ntr open up on tarakaratna Health condition

ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధించాల‌ని ఎన్టీఆర్ కోరారు.వైద్యంతో పాటు,ఆత్మ బ‌లం, మ‌నోబ‌లం, తాత‌గారితో పాటు ఎంతో ఆశీర్వాదం మా అన్న‌కి ఉంది. ఇంత‌క‌ముందు మాదిరిగానే ఆయ‌న మాతో క‌లిసి తిరుగుతారు అని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మ‌రి కొంత మంది డాక్టర్స్ కూడా ఈ ఆసుప‌త్రికి వ‌చ్చి ట్రీట్‌మెంట్ వ‌చ్చి వైద్యం అందించే ఛాన్స్ ఉంది అని ఎన్టీఆర్ అన్నారు. క‌ళ్యాణ్ రామ్ సైతం ఆయ‌న ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం తార‌క‌ర‌త్న ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని అన్నారు. ఇక బాల‌య్య అంత‌క‌ముందు మాట్లాడుతూ.. స్టెంట్ వేయ‌డం కుద‌ర‌లేదు, కోలుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది.

Jr NTR : గెట్ వెల్ సూన్

JR ntr open up on tarakaratna Health condition

JR ntr open up on tarakaratna Health condition

ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లారు ఎన్టీఆర్ క‌ళ్యాణ్ రామ్. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసి ఎన్టీఆర్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై కుటుంబ సభ్యులు, వైద్య బృందాన్ని అడిగి ఎన్టీఆర్ క‌నుకున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి, పిల్లలకు ఎన్టీఆర్ సోదరులు ధైర్యం చెప్పారు. జూనియర్ వెంట ఆయన సతీమణి ప్రణతి కూడా ఉన్నారు. మరోవైపు.. ఇవాళే బాలయ్య సతీమణి వసుంధర , కుమార్తె బ్రహ్మణి కాసేపటి క్రితమే ఆస్పత్రికి చేరుకుని తారకరత్నను పరామర్శించారు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp