Taraka Ratna : అత్యంత విషమంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి.. హెల్త్ బుల్లెట్ విడుదల..!
Taraka Ratna : ఏపీలో హీరో నందమూరి తారక రత్నకు విషాదం చోటు చేసుకుది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ శుక్రవారం రోజు యువ గళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ కు సపోర్ట్ గా తారకరత్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పాదయాత్ర ప్రారంభించిన సమయంలో తారకరత్న ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన కుప్పంలోని ఆసుపత్రిలోకి తరలించారు. పరిస్థితి మరీ క్రిటికల్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ వైద్య సిబ్బంది శనివారం హెల్త్ బుల్లెట్ ను విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.
పాదయాత్ర ప్రారంభానికి ముందు లోకేష్ తన మామ బాలకృష్ణ, టిడిపి నేతలతో కలిసి చిత్తూరు జిల్లా లక్ష్మీపురంలో శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ కు మద్దతు తెలపటానికి తారకరత్న కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాదయాత్రలో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని వెంటనే కుప్పంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పిఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.