Jr NTR : అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో రామ్ చరణ్ కూడా మరో ముఖ్య పాత్ర చేయగా, రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. మార్చి 25న విడుదల కానున్న ఈ సినిమాని వీక్షించేందుకు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 24న కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడనున్నాయి.
మరికొన్ని గంటల్లో షోస్ పడనున్న నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ చిత్రం మొట్టమొదటి ప్రీమియర్ ఎక్కడ పడనుందనే విషయం బయటకొచ్చింది. గతంలో రాజమౌళి భారీ సినిమా ‘బాహుబలి’ ఫస్ట్ టాక్ కోసం మొదట కరణ్ జోహార్‌తో సహా కొంతమంది బాలీవుడ్ ప్రముఖులకు ముంబైలో స్పెషల్ షో వేయించారు. ఈ క్రమంలోనే ఈ సారి ఆ బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నారట. ఈ మేరకు తన సన్నిహితులు, సన్నిహితుల కోసం ఓ స్పెషల్ షో అరేంజ్ చేశారట. ఓ 52 మంది ప్రముఖులకు ఈ స్పెషల్ షోకి ఆహ్వానం అందిందట.
నేడు (మార్చి 24) రాత్రి 9 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబి మాల్‌లో మొదటి ఆట ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్ షోకి ఎన్టీఆర్ ఎవరెవరిని ఆహ్వానించారనే విషయంపై క్లారిటీ లేదు. ఈ షో ద్వారానే ఫస్ట్ టాక్ బయటకు వస్తుందని అంటున్నారు. అలాగే నేటి రాత్రి యూఎస్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ప్రస్తుతం దేశవిదేశాల్లో ట్రిపుల్ ఆర్ పేరు మారుమోగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉండగా, ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.