Jr NTR : త‌న ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కోసం ముందు రోజే స్పెష‌ల్ షో ప్లాన్ చేసిన ఎన్టీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : త‌న ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కోసం ముందు రోజే స్పెష‌ల్ షో ప్లాన్ చేసిన ఎన్టీఆర్

 Authored By sandeep | The Telugu News | Updated on :24 March 2022,9:30 pm

Jr NTR  : అర‌వింద స‌మేత చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కూడా మ‌రో ముఖ్య పాత్ర చేయ‌గా, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. మార్చి 25న విడుద‌ల కానున్న ఈ సినిమాని వీక్షించేందుకు ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 24న కొన్ని చోట్ల ప్రీమియ‌ర్స్ ప‌డ‌నున్నాయి.

Jr NTR  : స్పెష‌ల్ షో ప్లాన్..

మరికొన్ని గంటల్లో షోస్ పడనున్న నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ చిత్రం మొట్టమొదటి ప్రీమియర్ ఎక్కడ పడనుందనే విషయం బయటకొచ్చింది. గతంలో రాజమౌళి భారీ సినిమా ‘బాహుబలి’ ఫస్ట్ టాక్ కోసం మొదట కరణ్ జోహార్‌తో సహా కొంతమంది బాలీవుడ్ ప్రముఖులకు ముంబైలో స్పెషల్ షో వేయించారు. ఈ క్రమంలోనే ఈ సారి ఆ బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నారట. ఈ మేరకు తన సన్నిహితులు, సన్నిహితుల కోసం ఓ స్పెషల్ షో అరేంజ్ చేశారట. ఓ 52 మంది ప్రముఖులకు ఈ స్పెషల్ షోకి ఆహ్వానం అందిందట.

Jr ntr plans special show to his family

Jr ntr plans special show to his family

నేడు (మార్చి 24) రాత్రి 9 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబి మాల్‌లో మొదటి ఆట ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్ షోకి ఎన్టీఆర్ ఎవరెవరిని ఆహ్వానించారనే విషయంపై క్లారిటీ లేదు. ఈ షో ద్వారానే ఫస్ట్ టాక్ బయటకు వస్తుందని అంటున్నారు. అలాగే నేటి రాత్రి యూఎస్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ప్రస్తుతం దేశవిదేశాల్లో ట్రిపుల్ ఆర్ పేరు మారుమోగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాపై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉండ‌గా, ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది