Jr NTR : స్టార్ హీరో విలన్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. అందాల భామ కూడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : స్టార్ హీరో విలన్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. అందాల భామ కూడా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :6 February 2025,8:20 pm

ప్రధానాంశాలు:

  •  NTR : స్టార్ హీరో విలన్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. అందాల భామ కూడా..!

Jr NTR : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో జరిగాయి. కానీ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. వార్ 2 ని ఈమధ్యనే పూర్తి చేసిన తారక్ త్వరలో నీల్ సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా మలయాళ స్టార్ టోవినో థామస్ ని ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడట. టోవినో థామస్ మలయాళంలో మంచి సినిమాలు చేస్తున్నాడు. ఐతే ఇప్పటివరకు తను అక్కడే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఎన్ టీ ఆర్ సినిమా ఆఫర్ రాగానే అతను సర్ ప్రైజ్ అయ్యాడని తెలుస్తుంది.

Jr NTR స్టార్ హీరో విలన్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అందాల భామ కూడా

Jr NTR : స్టార్ హీరో విలన్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. అందాల భామ కూడా..!

Jr NTR : కన్నడ భామ రుక్మిణి వసంత్..

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించిన ఈ అమ్మడు ఈమధ్యనే నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది. ఐతే ఎన్టీఆర్ సినిమానే అమ్మడికి గ్రాండ్ లాంచింగ్ అని చెప్పొచ్చు.

సో తారక్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లానింగ్ తోనే వస్తున్నాడని అర్ధమవుతుంది. మరి ఎన్టీఆర్ నీల్ టోవినో థామస్ కాంబో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు కానీ ఆల్రెడీ తమిళ్ లో ఆ టైటిల్ వాడేశారు. అంతకుముందు ఈ సినిమాకు రేడియేటర్ అని పెట్టాలని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమా మార్చి నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. NTR, Prashanth Neel, Tovino Thomas, Rukmini Vasanth

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది