Nara Lokesh Birthday : నారా లోకేష్ కు జూ. ఎన్టీఆర్ విషెష్..షాక్ లో ఫ్యాన్స్
Nara Lokesh Birthday : తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సినీ వర్గాల్లో నేడు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. “నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ఏడాది మీకు అన్ని విధాలా అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను” అంటూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ – నారా కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, తారక్ స్పందించిన తీరు అటు నందమూరి అభిమానులను, ఇటు టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Nara Lokesh Birthday : నారా లోకేష్ కు జూ. ఎన్టీఆర్ విషెష్..షాక్ లో ఫ్యాన్స్
నిజానికి గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ మరియు చంద్రబాబు కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. లోకేష్ పాదయాత్ర చేసినా, చంద్రబాబు జైలుకు వెళ్లినా, లేదా కూటమి భారీ విజయం సాధించినా ఎన్టీఆర్ నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనికి తోడు సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయడం, ఆయన వైఎస్ జగన్ కు దగ్గరవుతున్నారనే పుకార్లు షికారు చేయడం వంటి పరిణామాలు గ్యాప్‌ను మరింత పెంచాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణం మధ్య ఎన్టీఆర్ నేరుగా లోకేష్‌కు విషెస్ చెప్పడం, ఇరు కుటుంబాల మధ్య మళ్లీ సఖ్యత నెలకొంటుందా? అనే చర్చకు దారితీసింది.
ఎన్టీఆర్ విషెస్ చెప్పడం వెనుక ఉన్న వ్యూహం లేదా భావోద్వేగం ఏదేమైనప్పటికీ, ఇది రాజకీయంగా పెద్ద చర్చకే దారితీసింది. కేవలం మర్యాదపూర్వకంగానే విషెస్ చెప్పారా లేక భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో కూడా భాగం పంచుకుంటారా? అని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులు ఈ పరిణామాన్ని పాజిటివ్ గా చూస్తున్నారు. ‘ఒకే కుటుంబం – ఒకే మాట’ అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తే అది పార్టీకి కూడా మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ఎన్టీఆర్ ఒక్క ట్వీట్ తో అటు తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడమే కాకుండా, తన సోదరుడు లోకేష్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నట్లయింది.