Home » Entertainment » Jr Ntr Rajashekhar Will Be Vilain In Next Film
Entertainment

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ మూవీలో విలన్‌గా రాజశేఖర్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీనియర్ హీరో..?

Authored By
mallesh
The Telugu News | Published on: January 11, 2022, 8:00 pm
Advertisement

Jr NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ నెల 7న విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా పరిస్థితుల దృష్ట్యా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. కాగా, తారక్ నెక్ట్ట్ ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. కాగా, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకుగాను సీనియర్ హీరో రాజశేఖర్ ను మూవీ యూనిట్ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి.సినిమాను కమర్షియల్‌గా తీస్తూనే సొసైటీకి చక్కని సందేశాన్ని అందిస్తున్న కొరటాల శివ.. తారక్‌తో చేయబోయే సినిమాలోనూ మంచి సందేశం ఇవ్వనున్నారు.

Advertisement

గతంలో తారక్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ఈ క్రమంలోనే వీరి కాంబోలో వచ్చే మూవీపైన భారీగా అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్‌ను తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తుందట. మంచి క్యారెక్టర్స్‌తో పాటు సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్ కూడా ప్లే చేసేందుకుగాను తాను రెడీ గానే ఉన్నానని రాజశేఖర్ గతంలో ప్రకటించాడు.ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మంచి పాత్ర కోసం రాజశేఖర్‌ను సంప్రదించనున్నారట. అయితే, ఆ పాత్ర సినిమాలో ప్రతినాయకుడిదా? లేదా సపోర్టింగ్ రోల్ నా? అనేది తెలియాల్సి ఉంది.

jr ntr rajashekhar will be vilain in next film

Advertisement

Jr NTR : కీలక పాత్రల్లో నటించేందుకు రాజశేఖర్ రెడీ..

కొరటాల శివ తన చిత్రాల్లో క్యాస్టింగ్ గురించి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. ‘మిర్చి’లో సత్యరాజ్, ‘శ్రీమంతుడు’లో జగపతి బాబు., ‘జనతా గ్యారేజ్’లో మోహన్ లాల్, ‘ఆచార్య’లో రామ్ చరణ్ తేజ్.. ఇలా పవర్ ఫుల్ సపోర్టింగ్ రోల్స్ ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే తారక్ చిత్రంలో రాజశేఖర్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకుంటారని టాక్. చూడాలి మరి… ఏమవుతుందో.. ఇకపోతే కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా.. వచ్చే నెల 4న విడుదల కావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రం కూడా కొవిడ్ వలన వాయిదా పడుతుందని వార్తలొస్తున్నాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి