JR NTR silence about brahmastra movie event cancel
JR NTR : బాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర తెలుగు వర్షన్ ప్రమోషన్ లో భాగంగా నిన్న రామోజీ ఫిలిం సిటీ లో అత్యంత భారీ ఎత్తున అభిమానుల మధ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించేందుకు శ్రేయస్ మీడియా ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది. దాదాపుగా ఆరెండున్నర కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ ఏర్పాట్లు చేశారట. ఇంటి నుండి ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బయలుదేరారు అన్న వెంటనే ఈవెంట్ కి అనుమతులు ఇవ్వడం కుదరదు అంటూ తెలంగాణ పోలీస్ శాఖ వారు చివరి నిమిషంలో కార్యక్రమాన్ని నిర్వహకులకు తెలియజేయడంతో కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. ముంబై నుంచి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా పార్క్ హయత్ హోటల్లో ఒక మీడియా సమావేశం నిర్వహించి ముంబై వెళ్ళి పోయారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనాల్సిన ఎన్టీఆర్ ప్రెస్ మీట్ లో కొద్ది సేపు మాట్లాడి వెళ్లిపోయాడు. ఆయన మాట్లాడిన సమయంలో కార్యక్రమం క్యాన్సల్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయంపై స్పందిస్తాడని అంతా భావించారు. తెలంగాణ గవర్నమెంట్ ఇలా చేస్తుందేంటి అంటూ విమర్శలు చేస్తాడని భావించారు. కానీ అనూహ్యంగా ఆయన కేవలం అభిమానులకు సారీ చెప్పి తన మనసులోనే అంతా దాచేసుకున్నాడు. కార్యక్రమం కాన్సల్ అవ్వడానికి కారణం ఏంటి అనేది అందరికీ తెలుసు.. ఎన్టీఆర్ కి కూడా ఆ విషయం బాగా తెలుసు. అయినా కూడా కనీసం నోరు ఎత్తకుండా మౌనంగానే ఉండి ఎన్టీఆర్ అభిమానులకు మరింతగా కోపం తెప్పించాడు.
JR NTR silence about brahmastra movie event cancel
ఎన్టీఆర్ ఆ విషయమై స్పందించలేదు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసి ఉంటే బాగుండేది అంటూ కొందరు ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ అలా చేసి ఉంటే మరింతగా ఇబ్బందులు ఎదురే అయ్యేవని ఆయన నటించే ప్రతి సినిమాకు తెలంగాణలో ఇబ్బందులు తలెత్తేవి అని కొందరు భావిస్తున్నారు. ఇదంతా బిజెపి జాతీయ నాయకుడు కేంద్ర మంత్రి అయిన అమిత్ షా నీ కలవడం వల్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా ఎన్టీఆర్ దీనికి సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.