JR NTR : బ్రహ్మాస్త్ర బ్యాక్‌… అంతా తెలిసినా నోరు మూసుకుని ఉన్న ఎన్టీఆర్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

JR NTR : బ్రహ్మాస్త్ర బ్యాక్‌… అంతా తెలిసినా నోరు మూసుకుని ఉన్న ఎన్టీఆర్‌

JR NTR  : బాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర తెలుగు వర్షన్ ప్రమోషన్ లో భాగంగా నిన్న రామోజీ ఫిలిం సిటీ లో అత్యంత భారీ ఎత్తున అభిమానుల మధ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించేందుకు శ్రేయస్ మీడియా ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది. దాదాపుగా ఆరెండున్నర కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ ఏర్పాట్లు చేశారట. ఇంటి నుండి ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బయలుదేరారు అన్న వెంటనే ఈవెంట్ కి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 September 2022,5:00 pm

JR NTR  : బాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర తెలుగు వర్షన్ ప్రమోషన్ లో భాగంగా నిన్న రామోజీ ఫిలిం సిటీ లో అత్యంత భారీ ఎత్తున అభిమానుల మధ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించేందుకు శ్రేయస్ మీడియా ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది. దాదాపుగా ఆరెండున్నర కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ ఏర్పాట్లు చేశారట. ఇంటి నుండి ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బయలుదేరారు అన్న వెంటనే ఈవెంట్ కి అనుమతులు ఇవ్వడం కుదరదు అంటూ తెలంగాణ పోలీస్ శాఖ వారు చివరి నిమిషంలో కార్యక్రమాన్ని నిర్వహకులకు తెలియజేయడంతో కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. ముంబై నుంచి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా పార్క్ హయత్ హోటల్లో ఒక మీడియా సమావేశం నిర్వహించి ముంబై వెళ్ళి పోయారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనాల్సిన ఎన్టీఆర్ ప్రెస్ మీట్ లో కొద్ది సేపు మాట్లాడి వెళ్లిపోయాడు. ఆయన మాట్లాడిన సమయంలో కార్యక్రమం క్యాన్సల్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయంపై స్పందిస్తాడని అంతా భావించారు. తెలంగాణ గవర్నమెంట్ ఇలా చేస్తుందేంటి అంటూ విమర్శలు చేస్తాడని భావించారు. కానీ అనూహ్యంగా ఆయన కేవలం అభిమానులకు సారీ చెప్పి తన మనసులోనే అంతా దాచేసుకున్నాడు. కార్యక్రమం కాన్సల్ అవ్వడానికి కారణం ఏంటి అనేది అందరికీ తెలుసు.. ఎన్టీఆర్ కి కూడా ఆ విషయం బాగా తెలుసు. అయినా కూడా కనీసం నోరు ఎత్తకుండా మౌనంగానే ఉండి ఎన్టీఆర్ అభిమానులకు మరింతగా కోపం తెప్పించాడు.

JR NTR silence about brahmastra movie event cancel

JR NTR silence about brahmastra movie event cancel

ఎన్టీఆర్‌ ఆ విషయమై స్పందించలేదు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసి ఉంటే బాగుండేది అంటూ కొందరు ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ అలా చేసి ఉంటే మరింతగా ఇబ్బందులు ఎదురే అయ్యేవని ఆయన నటించే ప్రతి సినిమాకు తెలంగాణలో ఇబ్బందులు తలెత్తేవి అని కొందరు భావిస్తున్నారు. ఇదంతా బిజెపి జాతీయ నాయకుడు కేంద్ర మంత్రి అయిన అమిత్ షా నీ కలవడం వల్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా ఎన్టీఆర్ దీనికి సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది