యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: May 25, 2021, 10:13 am

యంగ్ టైగర్ అభిమానులకు శుభవార్త వచ్చింది. తాను కోవిడ్‌ను జయించానని, కరోనా నెగెటివ్ వచ్చిందని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ మేరకు తాజాగా ఓ ట్వీట్ వేశాడు. కరోనా నెగెటివ్ వచ్చిందని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మీరు అందించిన విషెస్‌కు థ్యాంక్స్. కిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం, వీరు, ప్రవీణ్ కులకర్ణి, టెనెట్ డయాగ్నోస్టిక్‌కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.

Jr NTR Tests Corona Negative

Jr NTR Tests Corona Negative

వారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. కోవిడ్ 19ని మనం సీరియస్‌గా తీసుకోవాలి. పాజిటివ్ మైండ్, జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ కరోనాను మనం జయించవచ్చు. మీకున్న ధైర్యమే మీ బలం.. ఈ పోరాటంలో కావాల్సింది అదే. ధైర్యంగా ఉండండి ఆందోళన చెందకండి. మాస్క్ ధరించండి.. ఇంట్లోనే ఉండండి అని ఎన్టీఆర్ సూచించారు. మొత్తానికి పది హేను రోజుల తరువాత ఎన్టీఆర్ కరోనా నుంచి బయటపడ్డారు.

మే 10న ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆందోళన చెందకండి.. అంతా బాగానే ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇక తనకు ఆరోగ్యం బాగా లేకపోవడం, బయట పరిస్థితులు బాగా లేకపోవడంతో బర్త్ డే వేడుకలు కూడా నిర్వహించవద్దని ఎన్టీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇప్పుడు తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ హీరో కరోనా నుంచి కోలువడంతో సంబరపడిపోతోన్నారు.

Cinema Desk

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp