RRR : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ అందించిన రాజమౌళి.. అదిరిపోయిందంతే..!
RRR : ఆర్ఆర్ఆర్ మూవీ.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా మీదనే ఉంది. బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై కేవలం తెలుగు సినిమా అభిమానులే కాదు.. యావత్ దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే.. కొమరంభీమ్, అల్లూరి సీతారామరాజులకు సంబంధించిన టీజర్లను సినీ అభిమానుల కోసం వదిలారు జక్కన్న. ప్రస్తుతం కరోనా వల్ల సినిమా విడుదల లేట్ అవుతోంది. అయితే.. ఈనేపథ్యంలో సినీ అభిమానులను అలరించడం కోసం.. మే 20న అంటే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఎన్టీఆర్ అభిమానులకు అధిరిపోయే కానుకను అందించాడు రాజమౌళి.

junior ntr look as komaram bheem in rrr movie
ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ. ఒకరు తెలంగాణకు చెందిన కొమరం భీమ్ అయితే.. ఇంకొకరు ఏపీకి చెందిన అల్లూరి సీతారామరాజు. నిజానికి.. వీళ్లిద్దరూ నిజంగా కలుసుకోలేదు. కానీ.. వీళ్లిద్దరూ కలుసుకొని.. ఆదివాసీల కోసం, పేదల ప్రజల హక్కుల కోసం పోరాటం జరిపితే ఎలా ఉంటుంది.. అన్న కాన్సెప్ట్ తో కల్పిత కథతో వస్తున్న సినిమా ఇది.
RRR : గోండు బెబ్బులి గాండ్రింపు మామూలుగా లేదు
తాజాగా తారక్ పుట్టిన రోజు సందర్భంగా కొమరం భీమ్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి ఆ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. కొమరం భీమ్ కు ఏమాత్రం తీసిపోకుండా.. బల్లెం విసురుతూ.. కనిపించారు ఎన్టీఆర్. ఇక.. కరోనా కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే.. సినిమాకు ఈ దసరాకు కానుకగా విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ప్రకటించినా.. కరోనా వల్ల సినిమా విడుదల ఆసల్యం అయ్యే అవకాశం ఉంది. ఇక.. ఈ సినిమాలో తారక్ కు జోడిగా.. హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తోంది. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోన్న విషయం తెలిసిందే.
My Bheem has a heart of gold.
But when he rebels, he stands strong and bold! ????Here’s @tarak9999 as the INTENSE #KomaramBheem from #RRRMovie.@ssrajamouli @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/8o6vUi9oqm
— rajamouli ss (@ssrajamouli) May 20, 2021