Home » Entertainment » Jr Ntr This Is The List Of Jr Ntr Lineup Movies
Entertainment

Jr NTR : ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్‌గా జూనియర్ ఎన్టీఆర్ .. క్రేజీ డైరెక్టర్స్‌తో ఆయన లైనప్ మూవీస్ ఇవే..

Authored By
mallesh
The Telugu News | Published on: December 20, 2021, 5:00 pm
Advertisement

Jr NTR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోతారని సినీ అభిమానులు అంటున్నారు. వారు అన్నట్లుగానే తారక్ సైతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ ఫేమ్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సినిమా పాన్ ఇండియా రిలీజ్ అని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. కాగా, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం.‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌లో తారక్ ‘కొమురం భీం’ పాత్ర పోషించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది.

Advertisement

కాగా, తారక్‌లోని యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఇప్పటికే ట్రైలర్‌ను చూసి ఇతర ఇండస్ట్రీల డైరెక్టర్స్‌కు అర్థమై ఉంటుందని నందమూరి అభిమానులు అంటున్నారు. ఇక తారక్ సైతం క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి ఆల్రెడీ డిస్కషన్స్ స్టార్ట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. కొరటాల శివతో సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్.. ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నారు. అది ఆయనకు 31వ చిత్రం కాగా, దీనిని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది.తారక్ ప్రశాంత్ నీల్ తర్వాత ‘బిగిల్’ ఫేమ్.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేస్తారని టాక్.

jr ntr this is the list of jr ntr lineup movies

Advertisement

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీస్ మామూలుగా ఉండవు..

ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే స్టోరి రెడీ అయిందని బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్‌‌లో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ కూడా చేయబోతున్నారట తారక్. నెక్స్ట్ ‘మాస్టర్’ ఫేమ్ లోకేశ్ కనకరాజ్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్, వక్కంతం వంశీలతో ఒక్కో సినిమా చేయబోతారని సమాచారం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేయబోతున్నారట తారక్. ఈ సినిమాల గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ అయితే రాలేదు. కానీ, డిస్కషన్ లో ఉన్నట్లు టాక్.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి